ఆ అరగంటనే వెరీ బ్యాడ్: విరాట్ కోహ్లీకి అంతా సంతోషమే

Published : Dec 24, 2019, 08:27 AM IST
ఆ అరగంటనే వెరీ బ్యాడ్: విరాట్ కోహ్లీకి అంతా సంతోషమే

సారాంశం

తనకు 2019లో అంతా అద్భుతంగానే గడిచిందని, కానీ ఓ అరగంట మాత్రమే వెరీ బ్యాడ్ అనిపించిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ప్రపంచ కప్ సెమీ ఫైనల్ ఓటమి కారణంగా 30 నిమిషాలు చేదుగా గడిచిందని చెప్పాడు.

కటక్: తనకు ఈ ఏడాది అంతా సంతోషంగానే గడిచిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కేవలం ఆ అరగంట మాత్రమే తనకు బ్యాడ్ అని అన్నాడు. వెస్టిండీస్ తో మూడో వన్డేలో విజయం సాధించిన తర్వాత అతను మీడియాతో మాట్లాడాడు. 

ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచులో ఆ 30 నిమిషాలు తప్ప ఈ ఏడాది అంతా అద్భుతంగా గడిచిందని కోహ్లీ చెప్పాడు. విజయం కోసం భారత్ ఎల్ల వేళలా తపిస్తుందని చెప్పాడు. ప్రత్యర్థులు ఎవరైనా భారత పేసర్లు ఎదుర్కోగలరని ఆయన అన్నాడు. 

స్పిన్నర్లను మించి పేసర్లు రాణిస్తున్నారని కోహ్లీ అన్నాడు. ఐసిసి నిర్వహించే ట్రోఫీలను గెలుచుకునేందుకు తాము నిత్యం శ్రమిస్తూనే ఉంటామని చెప్పాడు. జట్టులోకి వస్తున్న కొత్త ఆటగాళ్లు భవిష్యత్తులో భారత క్రికెట్ కు మూలస్తంభాలుగా మారుతారని అన్నాడు. ఒత్తిడిలో వారు ఎలా రాణిస్తారో తనకు చూడాలని ఉందని చెప్పాడు.

కటక్ లో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ పై భారత్ విజయం సాధించి సిరీస్ ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచులో 85 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.  

PREV
click me!

Recommended Stories

Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు