IPL2022: స్టేడియంలోకి పరుగెత్తుకు వచ్చిన అభిమాని.. పోలీస్ చేసిన పనికి కోహ్లీ రియాక్షన్..!

Published : May 27, 2022, 10:52 AM IST
 IPL2022: స్టేడియంలోకి పరుగెత్తుకు వచ్చిన అభిమాని.. పోలీస్ చేసిన పనికి కోహ్లీ రియాక్షన్..!

సారాంశం

ఈ క్రమంలో స్టేడియంలోకి పరుగులు తీసిన వారు కూడా చాలా మందే ఉన్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఓ వ్యక్తి  మైదానంలోకి దూసుకువచ్చాడు.  

IPL మ్యాచ్ లు సరదాగా జరుగుతున్నాయి. తమ అభిమాన జట్టు మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు స్టేడియానికి వెళ్లి అక్కడ సందడి చేస్తున్నారు.  అలా స్డేడియంకి వచ్చిన అభిమానుల్లో కొందరు... తమకు నచ్చిన క్రికెటర్ ని కలవాలని.. దగ్గర నుంచి చూడాలని ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలో స్టేడియంలోకి పరుగులు తీసిన వారు కూడా చాలా మందే ఉన్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఓ వ్యక్తి  మైదానంలోకి దూసుకువచ్చాడు.

కోల్ కతాలోని విఖ్యాత ఈడెన్ గార్డెన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , లక్నోసూపర్ జెయింట్స్  జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో లక్నో జట్టు 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే మ్యచ్ జరుగుతున్న సమయంలో ఓ అకతాయి అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. ఫేవరెట్ ప్లేయర్ ను గ్రౌండ్ లో కలిసి వైరల్ అయిపోవాలని చూశాడు. అయితే పోలీసుల ఎంట్రీతో అతడి ప్లాన్ పూర్తిగా దెబ్బతింది.

 

లక్నో జట్టు బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఓ అకతాయి అభిమాని ఉన్నపళంగా మైదానంలో ప్రత్యక్షమయ్యాడు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తోన్న విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే అప్రమత్తంగా ఉన్న పోలీసులు వెంటనే మైదనాంలోకి దూసుకొచ్చి ఆ ఆకతాయి అభిమాని పని పట్టారు. ఏకంగా తుంటిరి ఫ్యాన్ ను తన భుజంపైన వేసుకున్న ఓ పోలీస్.. గ్రౌండ్ ను బయటకు తీసుకెళ్లాడు. ఇదంతా చాలా దగ్గర నుంచి చూసిన కోహ్లీ షాక్ గురయ్యాడు. అనంతరం కోహ్లీ కూడా పోలీసులో ఇమిటేట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?