టీ20ల్లో విరాట్ కోహ్లీ మరో రికార్డ్

By telugu teamFirst Published Dec 9, 2019, 8:17 AM IST
Highlights

ఇప్పటి వరకు 74 టీ20లు ఆడిన కోహ్లీ 2563 పరుగులు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఒక్క పరుగు తేడాతో రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ శర్మ 103 టీ20ల్లో 2562 పరుగులు చేశాడు. 2436 మూడో స్థానంలో మార్టిన్ గప్టిల్, నాలుగో స్థానంలో 2263 పరుగులతో షోయబ్ మాలిక్ నాలుగో స్థానంలో ఉన్నారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరో రికార్డు వేసుకున్నారు. ఇప్పటికే పలు రికార్డులను తన సొంతం చేసుకున్న కోహ్లీ తాజాగా.. మరో రికార్డ్ దక్కించుకున్నాడు. విండీస్‌తో ఇక్కడి గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20లో 19 పరుగులు మాత్రమే చేసి అవుటైన కోహ్లీ.. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 

ఇప్పటి వరకు 74 టీ20లు ఆడిన కోహ్లీ 2563 పరుగులు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఒక్క పరుగు తేడాతో రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ శర్మ 103 టీ20ల్లో 2562 పరుగులు చేశాడు. 2436 మూడో స్థానంలో మార్టిన్ గప్టిల్, నాలుగో స్థానంలో 2263 పరుగులతో షోయబ్ మాలిక్ నాలుగో స్థానంలో ఉన్నారు.

మొన్నటి వరకు ఆ నెంబర్ వన్ స్థానంలో రోహిత్ శర్మ ఉండగా... దానిని ఇప్పుడు విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు.  మరోవైపు అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ అత్యధిక అర్ధశతకాలు సాధించిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ 22 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. ఉప్పల్ టీ20లో 23వ హాఫ్ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ అతడ్ని వెనక్కి నెట్టి నెం.1 స్థానాన్ని అధిరోహించాడు. ఇక రికార్డ్‌లో కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత వరుసగా మార్టిన్ గప్తిల్ (17 హాఫ్ సెంచరీలు), పాల్ స్టిర్లింగ్ (16), డేవిడ్ వార్నర్ (16) టాప్-5లో కొనసాగుతున్నారు

click me!