RCB vs LSG : కోహ్లీ ఆటకు రికార్డులే ఫిదా.. ఐపిఎల్ చరిత్రలోనే ఇదో అద్భుతం

Published : May 27, 2025, 11:38 PM IST
Virat Kohli

సారాంశం

ఐపీఎల్‌లో కింగ్ కోహ్లీ అరుదైన రికాార్డు నమోదుచేసాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. అదేంటో తెలుసా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కొత్త మైలురాయిని అందుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) తరపున ఆడుతూ టి20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. ఒకే ఫ్రాంచైజీ తరపున 9000 టి20 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి)తో మ్యాచ్‌లో ఈ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.  

కోహ్లీ తన ఐపీఎల్ ప్రస్థానాన్ని ఆర్సిబి నుండే ప్రారంభించారు. ఇలా ఇప్పటివరకు అతడి ఐపిఎల్ కెరీర్ మొత్తం ఆర్సిబి ఆటగాడిగానే సాగింది. ఈ క్రమంలోనే ఒకే జట్టు తరపున ఆడుతూ 9000 టి20 పరుగులు సాధించిన రికార్డు కోహ్లీ పేరిట నమోదయ్యింది. 

టి20 క్రికెట్‌లో కోహ్లీ ఆధిపత్యాన్ని చాటారు… జట్టులో అతడి పాత్ర ఎంతలా ఉందో ఈ రికార్డు స్పష్టంగా తెలియజేస్తోంది. ఆర్‌సిబి బ్యాటింగ్‌లో ప్రధాన బలం కోహ్లీనే, ఇతడు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ఐపీఎల్ 2025 ఉత్కంఠగా సాగుతున్న తరుణంలో కోహ్లీ రికార్డు ఆర్‌సిబి అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో కీలకమైన ఈ మ్యాచ్‌లో కోహ్లీ వ్యక్తిగత రికార్డు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

కోహ్లీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో నిరంతరం రికార్డులు సృష్టిస్తున్నాడు. టి20 క్రికెట్‌లో అతని కొత్త మైలురాయి ప్రపంచ క్రికెట్‌లో అతని స్థానాన్ని, అభిమానుల హృదయాల్లో చిరస్థాయిని సంపాదించి పెట్టింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indian Cricket: టెస్టుల్లో 300, వన్డేల్లో 200, ఐపీఎల్‌లో 100.. ఎవరీ మొనగాడు?
IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?