Rishabh Pant: రిషబ్ పంత్ సెంచరీ.. సోమర్సాల్ట్ సెలబ్రేషన్స్ చూశారా !

Published : May 27, 2025, 11:22 PM IST
Rishabh pant celebration

సారాంశం

Rishabh Pant: రిషబ్ పంత్ సూపర్ సెంచరీతో (118 పరుగులు) లక్నో సూపర్ జెయింట్స్‌ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు 228 పరుగుల భారీ టార్గెట్ ను ఉచింది. పంత్ సెంచరీ సెలబ్రేషన్స్ వైరల్ గా మారింది.

Rishabh Pant Century and Somersault Celebration: లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ రిషబ్ పంత్  ఐపీఎల్ లో రెండో సెంచరీ కొట్టాడు. మంగళవారం లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో తన పాత ఫామ్‌కు తిరిగి వచ్చాడు.

RCB స్టాండ్-ఇన్ కెప్టెన్ జితేష్ శర్మ టాస్ గెలిచి లక్నోకు మొదట బ్యాటింగ్ అప్పగించాడు. లక్నో టీమ్ ఆర్సీబీ బౌలింగ్ ను దంచికొట్టింది. ఫోర్లు సిక్సర్ల మోత మోగిస్తూ  20 ఓవర్లలో 227/3 పరుగులు చేసింది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ 61 బంతుల్లో 118 పరుగుల సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. పంత్ మిచెల్ మార్ష్‌తో కలిసి రెండో వికెట్‌కు 152 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మిచెల్ మార్ష్ మరోసారి మంచి నాక్ ఆడాడు. అతను 37 బంతుల్లో 67 పరుగులు చేశాడు.

రిషబ్ పంత్ సెంచరీ సెలబ్రేషన్స్ వైరల్

రిషబ్ పంత్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత టెస్ట్ వైస్-కెప్టెన్‌గా నియమితుడైన 27 ఏళ్ల పంత్, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో తన పేలవమైన ఫామ్ కారణంగా విమర్శలను ఎదుర్కొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై యాభై పరుగులు చేసిన తర్వాత, పంత్ తన స్థిరత్వాన్ని కొనసాగించడంలో విఫలమయ్యాడు, దీనివల్ల అతని ఫామ్‌పై విమర్శలు, ప్రశ్నలు వచ్చాయి.

అయితే, రిషబ్ పంత్ తన విమర్శకుల నోళ్లు మూయించాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పంత్ తన సోమర్సాల్ట్ సెలబ్రేషన్స్ తో సెంచరీ సంబరాలు జరుపుకున్నాడు. లక్నో కోచింగ్ సిబ్బంది, డగౌట్‌లోని ఆటగాళ్ళు కెప్టెన్ హీరోయిక్ ఇన్నింగ్స్‌కు లేచి నిలబడి అభినందించారు. ఎకానా ప్రేక్షకులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. రిషబ్ పంత్ సెంచరీ సెలబ్రేషన్స్ ఇక్కడ చూడండి. 👇

 

ఐపీఎల్ 2025 సీజన్‌లో తొలి సెంచరీకి ముందు రిషబ్ పంత్ స్కోర్లు  0, 15, 2, 2, 21, 63, 3, 0, 4, 18, 7, 16. అతని అద్భుతమైన సెంచరీ తర్వాత రిషబ్ పంత్ ఈ సీజన్ పరుగులు 269కి పెరిగాయి. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !