ఐదో స్థానమూ కీలకమే...అక్కడ అతడితో బ్యాటింగ్ చేయించాలి: సచిన్

By Arun Kumar PFirst Published May 24, 2019, 5:28 PM IST
Highlights

ఇంగ్లాండ్ వేదికగా మరికొద్ది రోజుల్లోనే ప్రపంచ దేశాల మధ్య వన్డే వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే  అన్ని దేశాలు ఇంగ్లాండ్ కు చేరుకున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగుతోంది. అయితే టీమిండియా దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మాత్రం బ్యాటింగ్ లైనఫ్ లో మార్పులు చేపట్టాలని సూచించారు. లేకుంటే టీమిండియా ఈ మెగా టోర్నీలో ఇబ్బందులు పడటం ఖాయమంటూ మేనేజ్ మెంట్ ను హెచ్చరించారు. 

టీమిండియా మేనేజ్ మెంట్ కేవలం టీమిండియా బ్యాటింగ్ లైనప్ లో నాలుగో స్థానం గురించే ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ అంతకంటే ముఖ్యమైనది ఐదో స్థానంలో ఎవరు బరిలోకి దిగుతున్నారు. కాబట్టి నాలుగో స్ధానంలో ఎవరిని ఆడించినా పరవాలేదు కానీ ఐదోస్థానంలో మాత్రం మహేంద్ర సింగ్ ను బరిలోకి దించాలని  సలహా ఇచ్చాడు. ఇలా టాఫ్ ఆర్డర్ విఫలమైన సమయంలో ధోని కాస్త ముందుగా బరిలోకి దింపితే మంచి ఫలితాలను రాబట్టవచ్చని సచిన్  అభిప్రాయపడ్డారు. 

టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు వస్తారు. కాబట్టి నాలుగో స్థానంలో ఎవరు వచ్చినా అతడికి ఈ ముగ్గురిలో ఎవరో ఒకరి సపోర్ట్ లభిస్తుంది. కానీ ఐదో స్థానంలో అలా కాదు. కాబట్టి  విశేష అనువభమున్న ధోని ఆ స్థానంలో బరిలోకి దిగేతే బావుంటుంది. ఇక మిడిల్ ఆర్డర్ లో పాండ్యాకు కూడా ధోని అండగా వుంటాడు. కాబట్టి వీరిద్దరు జట్టు కష్టకాలంలో వున్నపుడు పరుగులు సాధించిపెట్టగలరు.'' అంటూ సచిన్  ఐదో స్థానంలో ధోని బరిలోకి దిగడం ఎంత  అవసరమో వివరించారు.  

ప్రపంచ కప్ వార్తలు  

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. జూన్ 16న పాక్‌తో భారత్ ఢీ

click me!