
భారత క్రికెట్ జట్టులో వరుణ్ చక్రవర్తి మళ్లీ తన మిస్టరీ స్పిన్‌తో అదరగొట్టాడు. న్యూజీలాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అనుకోకుండా ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్న వరుణ్, తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. 5 కీలకమైన వికెట్లు తీసి న్యూజీలాండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసాడు.
న్యూజీలాండ్ పై భారత విజయంలో స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించడంతో సెమీఫైనల్‌కి ముందు టీమిండియాకు పెద్ద ప్రశ్న ఎదురైంది. నాలుగు స్పిన్నర్లతో వెళితేనే బాగుంటుందా? లేక ఇద్దరు పేసర్లతో హోరాహోరీ పోటీకి దిగాలా? అనే అంశంపై మేనేజ్‌మెంట్ ఆలోచనలో పడింది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఇప్పటికే రాణిస్తుండగా.. షమీ, రాణాలలో ఎవరు ప్లేయింగ్ 11లో ఉండాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.
భారత్ వరుసగా దుబాయ్ గ్రౌండ్ లో అన్న మ్యాచ్ లూ ఆడుతుంటడం భారత్ కు బాగా కలిసొస్తోందనే చెప్పాలి. మ్యాచ్ ముందుకు వెళ్లే కొద్దీ పిచ్ స్లో అవవడం ఇక్కడ సాధారణంగా గమనించవచ్చు. ఇది ఇండియన్ స్పిన్నర్లకు అనుకూలంగా మారడంతో.. వరుణ్ లాంటి మిస్టరీ స్పిన్నర్ కీలకంగా మారిపోయాడు. ఇక సెమీఫైనల్లో టీమిండియా ఏ వ్యూహాన్ని అనుసరిస్తుందో వేచి చూడాలి.
మొత్తానికి ఈ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి పది ఓవర్లు బౌలింగ్ చేసి 42 పరుగులకు అయిదు వికెట్లు తీశాడు. కీలకమైన యంగ్, ఫిల్స్ప్, బ్రాస్ వెల్, న్యూజీలాండ్ కెప్టెన్ శాంట్నర్, హెన్రీలను అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ విజయంలో కీలకంగా మారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.