హ్యాట్రిక్ తీసిన వైభవ్ అరోరా... మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ ప్లేయర్...

Published : Feb 21, 2021, 03:47 PM IST
హ్యాట్రిక్ తీసిన వైభవ్ అరోరా... మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ ప్లేయర్...

సారాంశం

 రుతురాజ్ గైక్వాడ్ అద్భుత సెంచరీ... ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో హ్యాట్రిక్ తీసిన వైభవ్ చౌదరి... మరోసారి నిరాశపరిచిన కేదార్ జాదవ్...

విజయ్ హాజారే ట్రోఫీ 2021లో హ్యాట్రిక్ నమోదైంది. మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో హిమాచల్‌ప్రదేశ్ బౌలర్ వైభవ్ అరోరా, ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో హ్యాట్రిక్ నమోదుచేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మహారాష్ట్ర, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 295 పరుగులు చేసింది.

మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 109 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 102 పరుగులు చేసి అవుట్ కాగా యష్ నహర్ 52, అజిమ్ ఖజి 47 పరుగులు చేశారు. కేదార్ జాదవ్ 25 బంతుల్లో ఒక్క ఫోర్‌తో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌ వేసిన వైభవ్ ఆరోరా, ఆఖరి మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు.

6 పరుగులు చేసిన నిఖిల్ నాయక్‌ను అవుట్ చేసిన వైభవ్, ఆ తర్వాతి బంతికి భవన్నేని బౌల్డ్ చేశాడు. ముఖైశ్ చౌదరిని ఎల్బీడబ్ల్యూగా డకౌట్ అయ్యాడు. లక్ష్యచేధనలో 30 ఓవర్ల ముగిసేసరికి 122 పరుగులు చేసింది హిమాచల్ ప్రదేశ్. వైభవ్ అరోరాను బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఐపీఎల్ వేలంలో రూ. 74 కోట్లు కొల్లగొట్టిన ఐదుగురు ప్లేయర్లు వీరే!
IND vs SA : టీమిండియాకు బిగ్ షాక్