ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. అదరగొట్టిన ఛండీగఢ్ కుర్రాడు..!

Published : Sep 10, 2021, 10:07 AM ISTUpdated : Sep 10, 2021, 10:11 AM IST
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. అదరగొట్టిన ఛండీగఢ్ కుర్రాడు..!

సారాంశం

50వ ఓవర్లో జస్కరన్‌ వరుసగా 6, 6, 6, 6, 6, 6 పరుగులు బాదాడు. చండీగఢ్‌లో పుట్టి వలస వెళ్లిన జస్కరన్‌ అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

అంతర్జాతీయ వన్డేల్లో ఛండీగఢ్ కుర్రాడు అదరగొట్టాడు. అరుదైన ఘనత సాధించాడు. ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా జస్కరన్ మల్హోత్రా నిలిచాడు. పపువా న్యూ గినియాతో జరిగిన రెండో వన్డేలో మీడియం పేసర్‌ గాడీ టోకా వేసిన 50వ ఓవర్లో జస్కరన్‌ వరుసగా 6, 6, 6, 6, 6, 6 పరుగులు బాదాడు. చండీగఢ్‌లో పుట్టి వలస వెళ్లిన జస్కరన్‌ అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఈ ఇన్నింగ్స్‌లో 124 బంతుల్లో 4 ఫోర్లు, 16 సిక్సర్లతో 173 పరుగులతో అజేయంగా నిలిచిన అతను వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మోర్గాన్‌ (17) తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అమెరికా 134 పరుగుల తేడాతో గెలిచింది. 2007 వన్డే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో డాన్‌ వాన్‌ బంగ్‌ ఓవర్లో హెర్షల్‌ గిబ్స్‌ 6 సిక్సర్లు కొట్టగా... అంతర్జాతీయ టి20ల్లో యువరాజ్‌ సింగ్, కీరన్‌ పొలార్డ్‌ ఈ అరుదైన ఫీట్‌ను ప్రదర్శించారు.  

 

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !