పంత్ చికిత్స పొందుతున్న హాస్పిటల్ ఫోటో షేర్ చేసిన ఊర్వశి.. ఇవి వేధింపులు కాక మరేంటి అంటూ మండిపాటు

Published : Jan 06, 2023, 02:20 PM IST
పంత్ చికిత్స పొందుతున్న హాస్పిటల్ ఫోటో షేర్ చేసిన ఊర్వశి.. ఇవి వేధింపులు కాక మరేంటి అంటూ మండిపాటు

సారాంశం

Rishabh Pant Accident: వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్   ప్రస్తుతం ముంబైలో చికిత్స తీసుకుంటున్నాడు.  అతడి ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ఎప్పటికప్పుడు    పర్యవేక్షిస్తున్నది. 

టీమిండియా యువ క్రికెటర్  రిషభ్ పంత్ కు   బాలీవుడ్ వర్ధమాన నటి ఊర్వశి రౌతేలాకు  మధ్య ఎఫైర్ (?) ఉందనేది   బహిరంగ రహస్యమే. కొద్దిరోజుల క్రితం ఊర్వశి ఓ  ఇంటర్వ్యూలో పేరు  చెప్పకుండా  రిషభ్ పంత్ పై సెటైర్లు సందించింది. ఆర్పీ (రిషభ్ పంత)  అని హింట్ ఇచ్చి మరీ  కామెంట్స్ చేసింది.  దీంతో ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిచి తర్వాత విడిపోయారని  పుకార్లు వినిపించాయి. ఇక రిషభ్ పంత్ కు  యాక్సిడెంట్ అయ్యాక  కూడా   ఊర్వశి..తాను దేవకన్యలా ఉన్న ఓ ఫోటోను షేర్ చేసి  ‘ప్రేయింగ్’  అని  పోస్టు పెట్టింది. పంత్ త్వరగా కోలుకోవాలనే ఆమె ఇలా  పోస్ట్ పెట్టిందని   నెటిజన్లు కామెంట్ చేశారు.   తాజాగా ఆమె మరో బాంబ్ పేల్చింది. 

రిషభ్ పంత్ ను  డెహ్రాడూన్ నుంచి   మెరుగైన చికిత్స కోసం  ముంబైకి తరలించిన విషయం తెలిసిందే. ముంబైలోని  కోకిలాబెన్ దీరూభాయ్ అంబానీ  ఆస్పత్రిలో  పంత్ కు చికిత్స అందిస్తున్నారు. తాజాగా  ఊర్వశి కూడా  ఇదే ఆస్పత్రి ఫొటోను షేర్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్   స్టోరీస్ లో  ఈ ఆస్పత్రి ఫోటోను షేర్ చేస్తూ.. ‘నాకు పంటి నొప్పి ఉంది.. చెక్ చేసుకోవడానికి వెళ్లా..’ అని  అందులో రాసుకొచ్చింది. 

అయితే ఊర్వశి పెట్టిన ఈ పోస్ట్ పై  నెటిజన్లు మండిపడుతున్నారు. ‘నువ్వసలు అమ్మాయివేనా..? ఎందుకు మా పంత్ ను ఇలా వేధిస్తున్నావ్..’ అని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పంత్  కు నీకు మధ్య బ్రేకప్ అయ్యాక కూడా అతడిని ఎందుకిలా పట్టి పీడిస్తున్నావ్ అని దుమ్మెత్తిపోస్తున్నారు.  

 

ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘ఇది  మానసికంగా హింసించడం తప్ప మరేంటి..?  ఒకవేళ  ఇదే తీరుగా ఎవరైనా పురుషుడు చేస్తే  వాడిని జైళ్లో పెట్టడమో లేక  నెట్‌ఫ్లిక్స్ లో  క్రైమ్ డాక్యుమెంటరీ  పేరిట ఓ వెబ్ సిరీస్ తీసేవారు..’ అని వ్యాఖ్యానించాడు. మరో నెటిజన్.. ‘అసలు ఇలాంటి  అమ్మాయిని  నేను ఎక్కడా చూడలేదు. పంత్   పేరును వాడుకుని ప్రజలందరి దృష్టిని తనవైపునకు మరలించే ప్రయత్నం చేస్తుంది.. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఇంతకు  బరి తెగించాలా..?’ అని వాపోయాడు. 

 

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !