INDvsENG 4th Test: రోహిత్ శర్మ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా...

By Chinthakindhi RamuFirst Published Sep 2, 2021, 4:21 PM IST
Highlights

11 పరుగులు చేసి అవుటైన రోహిత్ శర్మ... 28 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా... క్రిస్ వోక్స్‌కి తొలి ఓవర్‌లోనే వికెట్...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన టీమండియాకి క్రిస్ వోక్స్ తన మొదటి ఓవర్‌లోనే ఊహించని షాక్ ఇచ్చాడు. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి తొలి వికెట్‌కి 28 పరుగులు జోడించి, శుభారంభం దిశగా సాగుతున్న దశలో తొలి వికెట్ కోల్పోయింది భారత్...

27 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసిన రోహిత్ శర్మ, క్రిస్ వోక్స్ బౌలంగ్‌లో వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 11 పరుగులు వద్ద అవుటైన రోహిత్ శర్మ, 15 వేల పరుగులకి 11 పరుగుల దూరంలో నిలిచాడు.

396 ఇన్నింగ్స్‌ల్లో 14989 అంతర్జాతీయ పరుగులు చేసిన రోహిత్, మరో 11 పరుగులు చేస్తే 15 వేల మైలురాయిని అందుకుంటాడు. మరో ఎండ్‌లో కెఎల్ రాహుల్ మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు చేయాలంటే కెఎల్ రాహుల్ భారీ స్కోరు చేయడం తప్పనిసరి...

మూడో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన టీమిండియా, నాలుగో టెస్టులో రెండు మార్పులతో బరిలో దిగింది. ఇషాంత్ శర్మ స్థానంలో ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కి తుదిజట్టులో చోటు దక్కింది... 

click me!