
క్రికెట్ గాడ్, లిటిల్ మాస్టర్, మాస్టర్ బ్లాస్టర్...ఇవన్ని ఓ ఆటగాడికి అభిమానులు పెట్టుకున్న ముద్దు పేర్లు. ఆ ఆటగాడు క్రికెట్ గురించి ఏ కొంచెం తెలిసి వ్యక్తికైనా పరిచయమే. ఇక భారతీయ క్రికెట్ అభిమానులకైతే అతడో దేవుడు. క్రికెట్ అనేది ఓ మతమైతే దానికి అతడో దేవుడని కీర్తిస్తుంటారు. క్రికెట్ లో అతడు సాధించని మైలురాయి లేదనే చెప్పాలి. ఇలా భారతీయ క్రికెట్లో ఓ వెలువెలిగిన లెజెండరీ ప్లేయరే సచిన్ టెండూల్కర్.
బుధవారం ఆయన 45 ఏళ్లను పూర్తి చేసుకుని 46వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతడికి టీమిండియా తాజా ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, ఇతర క్రీడా ప్రముఖులు,సీనీ ప్రముఖులు, అభిమానుల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలను అందుకుంటున్నారు. ఇలా అతడిపై సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురుస్తోంది.
ఎవరెవరు ఎలా విషెస్ చెప్పారంటే:
ఐసిసి:
''అంతర్జాతీయ స్థాయిలో 200 టెస్టులు, 463 వన్డేలు ఆడిన లెజెండర ఇండియన్ బ్యాట్ మెన్ సచిన్. అతడు తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో అన్ని పార్మాట్లలో కలిపి ఏకంగా 34,357 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని వంద సెంచరీలను పూర్తిచేసుకున్నాడు. ఇలాంటి ప్రపంచ స్థాయి ఆటగాడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు'' అంటూ ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పింది.
బిసిసిఐ:
''మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు...ఈ ప్రత్యేక సందర్భంలో అంతర్జాతీయ క్రికెట్లో సౌతాఫ్రికా పై సచిన్ సాధించిన చారిత్రాత్మక డబుల్ సెంచరీని గుర్తుచేసుకుందాం'' అంటూ ఆనాటి మ్యాచ్ కు సంబంధించిన వీడియోను ఈ పోస్ట్ కు జతచేసింది.
వరల్డ్ కప్ 2019:
''2011 వరల్డ్ కప్ విన్నర్
అత్యధిక ప్రపంచ కప్ పరుగులు సాధించిన ఆటగాడు
అత్యధిక వరల్డ్ కప్ సెంచరీలు
అత్యధిక వరల్డ్ కప్ హాప్ సెంచరీలు
ఇలా ప్రపంచ కప్ చరిత్రలో ఎన్నో మరుపురాని, చెరిగిపోని రికార్డులు సృష్టించిన లిటిల్ మాస్టర్ సచిన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు''