మా ఓటమికి కారణాలివే: సన్ రైజర్స్ కెప్టెన్ భువనేశ్వర్

By Arun Kumar PFirst Published Apr 24, 2019, 3:48 PM IST
Highlights

చెన్నై వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం ద్వారా గత మ్యాచ్ లో తమను ఓడించిన హైదరాబాద్ జట్టుపై చెన్నై ప్రతీకారం తీర్చుకుంది. అయితే చెన్నై గెలుపుకి ఆ జట్టు ఓపెనర్ షేన్ వాట్సన్ అద్భుతమైన  బ్యాటింగ్ ప్రదర్శన ఎంత కారణమో తమ ఆటగాళ్ల వైఫల్యం అంతే కారణమని సన్ రైజర్స్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. ముఖ్యంగా తమ బౌలర్లు చెత్త ప్రదర్శన జట్టు విజయావకాశాలను దెబ్బతీసిందని భువీ అభిప్రాయపడ్డాడు. 

ఈ పిచ్ పై తాము సాధించిన 175 పరుగులు తక్కువస్కోరేనని... మరికొన్ని పరుగులు అదనంగా సాధించి వుండాల్సిందని భువీ అభిప్రాయపడ్డాడు. కానీ తమ బ్యాట్ మెన్స్ చివరి ఓవర్లలో కాస్త నెమ్మదించడంతో ఆ అవకాశాన్ని కోల్పోయామన్నాడు. అయినా ఆ సమయంలో విజయంపై నమ్మకంతోనే వున్నామని పేర్కొన్నాడు. 

అయితే తాము బౌలింగ్ కు దిగిన  సమయంలో మైదానంలో మంచు కురవడం ప్రారంభమయ్యిందని తెలిపాడు. ఇది బౌలర్లను ఇబ్బంది పెట్టకున్నా కాస్త  ప్రతికూల పరిస్థితులను కల్పించిందన్నాడు. దీనికి తోడు షేన్ వాట్సన్ భారీ షాట్లతో రెచ్చిపోవడంతో సన్ రైజర్స్ బౌలర్లు చూస్తూవుండటం తప్ప ఏం చేయలేకపోయామన్నాడు. ఈ మ్యాచ్ లో చెన్నై గెలుపె క్రెడిత్ మొత్తం వాట్సన్ కే దక్కురతుందని భువీ ప్రశంసించాడు. 

ఇక తమ బౌలర్ల వైఫల్యం కూడా సన్  రైజర్స్ ఓటమికి మరో కారణమని తెలిపాడు. ముఖ్యంగా స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ ఈ మ్యాచ్ లో తేలిపోయాడని...మూడేళ్ల ఐపిఎల్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా నాలుగు ఓవర్లలో ఏకంగా 44 పరుగులు సమర్పించుకున్నాడని గుర్తుచేశాడు. ప్రతి ఆటగాడికి  ఓ చెడ్డరోజు వస్తుందని...రషీద్ కు  ఇవాళ ఆ రోజు వచ్చిందన్నాడు. 

అంతేకాకుండా కీలకమైన ఇద్దరు ఓవర్సీస్ ఆటగాళ్లను మిస్సవ్వడం ఈ మ్యాచ్ పై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఓపెనర్ బెయిర స్టో సేవలను తాము కోల్పోయామని...అలాగే కెప్టెన్ విలియమ్సన్ లేని లోటు కూడా కనిపించిందన్నాడు. వారిద్దరు జట్టులో వుండుంటే  తమకు మరింత బలం చేకూరేదని పేర్కొన్నాడు. 

హైదరాబాద్ జట్టు  లీగ్ దశలో భాగంగా మరో నాలుగు మ్యాచులు ఆడాల్సివుందని...అందులో మూడు ఇతర మైదానాల్లోనే ఉన్నాయన్నాడు. ప్లే ఆఫ్ కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచుల్లో తాము మరింత మెరుగ్గా ఆడి విజయం సాధించమే మార్గమన్నాడు. అందువల్ల తమ ఆటగాళ్లందరు శక్తివంచన లేకుండా విజయం సాధించేందుకు కృషి చేస్తారని భావిస్తున్నట్లు భువి అభిప్రాయపడ్డాడు.   

click me!