దాచుకోవద్దు.. హిందూ, ముస్లిం అని ఆలోచించొద్దు: తోటివారిని ఆదుకోవాలన్న అక్తర్

By Siva KodatiFirst Published Mar 23, 2020, 4:27 PM IST
Highlights

కరోనా వైరస్ మానవాళిని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఒకరికొకరు సాయం  చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.

కరోనా వైరస్ మానవాళిని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఒకరికొకరు సాయం  చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. వైరస్ కట్టడిలో భాగంగా ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో పడిపోయిన నేపథ్యంలో ప్రజలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలన్నారు.

దొంగ నిల్వలు పెట్టుకోవద్దని, అదే సమయంలో రోజువారీ కార్మికుల కోసం కూడా ఆలోచించాల్సిన  అవసరం ఉందని అక్తర్ అన్నాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతీ స్టోర్ ఖాళీగానే కనపడుతోందని, లేదంటే మూసివేయడం జరుగుతోందని పేర్కొన్నాడు.

Also Read:కరోనా ఎఫెక్ట్ : పందులు ప్రశాంతంగా వీధుల్లో .. రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్

వచ్చే మూడు నెలల్లోనైనా పరిస్ధితి అదుపులోకి వస్తుందన్న గ్యారంటీ కనిపించడం లేదని గ్లోబల్ ఫోర్స్‌గా పనిచేయాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని అభ్యర్ధించాడు.

మతం కంటే  ఎక్కువగా ఆలోచించాలని ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఉన్నవాళ్లు.. లేనివాళ్లకు సాయం చేయడం ఒక్కటే మార్గమని అక్తర్ వ్యాఖ్యానించాడు. ఇక్కడ హిందూ, ముస్లిం అనే తేడా ఉండకూడదని.. మనిషి మనిషిలాగా ఉండి తమ వంతు సాయం చేయాలని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ విజ్ఞప్తి చేశాడు.

Also Read:కరోనాతో ఆటకు బ్రేక్.. కసరత్తుల వెంటపడ్డ క్రీడాకారులు

ఆర్ధిక పరిస్ధితి బాగున్నవారు నేటికి పెద్దగా సమస్యను ఏమీ చూడటం లేదని.. ఇక్కడ ఇబ్బంది పడుతున్నది పేద ప్రజలు మాత్రమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మనుషుల్లా బతుకుదామా.. లేక జంతువుల్లా ఉందామా అనేది ఎవరికి వారు ఆలోచించాలని అక్తర్ పిలుపునిచ్చాడు.

మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో భారతదేశ ప్రజలు, భారత ప్రభుత్వం చూపుతున్న చొరవని అక్తర్ ప్రశంసించాడు. అయితే పాక్ ప్రభుత్వం మాత్రం అలక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించాడు. ప్రపంచంలో ఇంత జరుగుతున్నా కరోనా వ్యాప్తిపై పాకిస్తాన్ ప్రజలకు అవగాహన లేదని మండిపడ్డాడు. 
 

click me!