ఆర్సీబీ గెలుస్తుందని ఫ్యాన్ గర్ల్ చేసిన పనికి.. స్విగ్గీ ఊహించని రిప్లై..!

Published : May 23, 2023, 11:31 AM IST
ఆర్సీబీ గెలుస్తుందని ఫ్యాన్ గర్ల్ చేసిన పనికి.. స్విగ్గీ ఊహించని రిప్లై..!

సారాంశం

ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ కూడా చేశాడు. కానీ అదృష్టం బాగోక ప్లే ఆఫ్ కి వెళ్లలేకపోయింది. అయితే, ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్ కచ్చితంగా తమ టీమ్ గెలుస్తుందని ఆశపడింది.

ఐపీఎల్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. ఏ మ్యాచ్ ఎవరు గెలుస్తారో చివరి వరకు కూడా చెప్పలేం. ప్రతి ఒక్కరూ తమ ఫేవరేట్ టీమ్ గెలవాలని ఆశపడుతూ ఉంటారు. ఓ యువతి కూడా అలానే అనుకుంది. ఆదివారం ఆర్సీబీ గెలిచి ఉంటే ప్లే ఆఫ్ కి చేరుకునేది. ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ కూడా చేశాడు. కానీ అదృష్టం బాగోక ప్లే ఆఫ్ కి వెళ్లలేకపోయింది. అయితే, ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్ కచ్చితంగా తమ టీమ్ గెలుస్తుందని ఆశపడింది.

ఆర్సీబీ గెలిస్తే పార్టీ ఇవ్వాలని అనుకుంది. ముందుగానే స్విగ్గీ నుంచి స్నాక్స్ అన్నీ ఆర్డర్ పెట్టింది. తన పీజీలోని అమ్మాయిలు అందరికీ పంచి పెట్టాలని ఆ స్నాక్స్ ఆర్డర్ చేసింది. కానీ ఏం లాభాలు అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయింది. దీంతో ఆ యువతి బాధ బాధ కాదు. పాపం వాళ్ల ఫ్రెండ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 

తన ఫ్రెండ్ ఆర్సీబీ గెలుస్తుందని ఈ స్నాక్స్ కొనింది అంటూ వాటిని షేర్ చేసింది. ఆమె పోస్ట్ కి స్విగ్గీ స్పందించడం విశేషం. ఈసారి మీరు మీ స్నేహితురాలికి టిష్యూ పేపర్ కొని ఇవ్వండి అంటూ రిప్లై ఇవ్వడం విశేషం. స్విగ్గీ రియాక్షన్ కి నెటిజన్ల రియాక్షన్ కూడా అదిరిపోయింది. పాపం ఆ అమ్మాయి అంటూ నెటిజన్లు ఆమె పట్ల జాలి చూపిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె పోస్టుకి దాదాపు 326వేల వ్యూస్ రావడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?