Guinness World Records: 400 ఫీట్ల ఎత్తు నుంచి పడిన బంతిని క్యాచ్ పట్టి.. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి..

By Srinivas MFirst Published Jan 10, 2022, 6:35 PM IST
Highlights

Thimothy Shanon Jebaseela Record Feet: క్రికెట్ లో ఓ బ్యాటర్.. బంతిని బలంగా బాది అది కాస్తా స్టేడియంలో ఫీల్డర్ కు సమీపంలో పడితే దానికోసం ఫీల్డర్లు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. అందులోనూ రన్నింగ్ క్యాచులంటే అంత ఈజీ కాదు.. కానీ అలాంటిది ఓవ్యక్తి ఏకంగా 400 ఫీట్ల పై నుంచి...
 

క్రికెట్, బేస్ బాల్, ఇతరత్రా బంతికి సంబంధించిన క్రీడలు ఆడుతున్నప్పుడు మాములుగా తక్కువ ఎత్తులో  వచ్చిన బంతిని అందుకోవడానికే  ఫీల్డర్లు నానా తంటాలు పడతారు. మిగిలిన ఆటలను పక్కనపెడితే క్రికెట్ లో అయితే  ఓ బ్యాటర్.. బంతిని బలంగా బాది అది కాస్తా స్టేడియంలో ఫీల్డర్ కు సమీపంలో పడితే దానికోసం అతడు/ఆమె  పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.  అందులోనూ రన్నింగ్ క్యాచులు పట్టడమనేది అంత సాధారణమైన విషయమేమీ కాదు. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 400 ఫీట్ల  నుంచి కింద పడ్డ క్రికెట్ బంతిని క్యాచ్ పట్టుకుని గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 

శ్రీలంకకు చెందిన తిమోతి షెనాన్ జెబాసీలన్  ఈ అరుదైన ఘనత సాధించాడు. సుమారు 400 ఫీట్ల (119.86 మీటర్లు) నుంచి  కిందపడ్డ క్రికెట్ బంతిని పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ పట్టాడు. దీంతో ఈ ఫీట్ సాధించిన తొలి వ్యక్తిగా నిలిచాడు. గతంలో అమెరికాకు చెందిన క్రిస్టన్ అనే వ్యక్తి 2019లో 114 మీటర్ల నుంచి కిందపడ్డ క్రికెట్ బాల్ ను క్యాచ్ పట్టి రికార్డు సృష్టించాడు. తమోతి ఇప్పుడు ఆ రికార్డును చెరిపేశాడు. 

2019లోనే ప్రయత్నం.. కానీ.. 

తిమోతి ఈ రికార్డు  సాధించడానికి గతంలోనే ప్రయత్నించాడు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు కూడా.. 2019లోనే ప్రపంచ రికార్డు బద్దలు కొడతామనుకుని ప్రయత్నించాడు. కానీ అంత ఎత్తు నుంచి కింద పడుతున్న బంతిని పట్టుకోవడానికి పరిగెత్తే క్రమంలో అతడు  అదుపుతప్పి కింద పడిపోయాడు.  దీంతో అతడికి గాయాలయ్యాయి. 

గాయమైనా తిమోతి పట్టు వీడలేదు.   గాయం నుంచి కోలుకున్నాక మళ్లీ ప్రయత్నించాడు. కొన్ని వందల సార్లు ప్రయత్నించి మళ్లీ.. గతేడాది నవంబర్ 21న ఈ రికార్డు సాధించడానికి పూనుకున్నాడు. ఆస్ట్రేలియాలోని ఓ స్థానిక గ్రౌండ్ లో అతడి స్నేహితులు..  ఓ డ్రోన్ లో బంతిని ఉంచి దానిని 393.3 ఫీట్ల వద్ద నుంచి వదిలిపెట్టారు. బంతి గతిని అంచనా వేసిన తిమోతి.. పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకున్నాడు.

చిన్నప్పుడే నాన్నను కోల్పోయి.. 

తిమోతి చిన్న వయసులోనే తండ్రిని కోల్సోయాడు. కానీ తల్లి లాలనలో పెరిగిన  అతడు.. చిన్నప్పట్నుంచే సాహసాలంటే ఇష్టంగా చేసేవాడు. నాలుగేండ్ల క్రితం బతుకుజీవుడా అని శ్రీలంక నుంచి ఆస్ట్రేలియాకు వచ్చి  అక్కడే ఉద్యోగం చేసి నివాసముంటున్నాడు.  తాను సంపాదించిన  మొత్తంలోంచి కొంత మొత్తాన్ని శ్రీలంకలో ఉంటున్నఅనాథలు, ఒంటరి మహిళల కోసం పనిచేసే ఒక ఎన్జీవోకు ఇస్తుండటం గమనార్హం.

click me!