ఫిట్‌నెస్ టెస్టులో ఆ ఇద్దరు యంగ్ ప్లేయర్లు ఫెయిల్... నటరాజన్‌ కూడా అనుమానమే..

Published : Mar 11, 2021, 04:32 PM IST
ఫిట్‌నెస్ టెస్టులో ఆ ఇద్దరు యంగ్ ప్లేయర్లు ఫెయిల్... నటరాజన్‌ కూడా అనుమానమే..

సారాంశం

నడుము నొప్పితో బాధపడుతున్న నటరాజన్... విజయ్ హాజారే ట్రోఫీ నుంచి నట్టూకి విశ్రాంతి కల్పించిన బీసీసీఐ... ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేయలేకపోయిన వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాటియా...

టీ20 సిరీస్ ఆరంభానికి ముందు భారత జట్టుకి ఊహించని ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. జస్ప్రిత్ బుమ్రా విశ్రాంతి తీసుకోవడంతో మెయిన్ పేసర్‌గా మారతాడని భావించిన యార్కర్ కింగ్ నటరాజన్, భుజం నొప్పితో బాధపడుతున్నాడు.

విజయ్ హాజారే ట్రోఫీ నుంచి తప్పుకున్న నటరాజన్, ప్రస్తుతం ఎన్‌సీఏ శిక్షణ తీసుకుంటున్నాడు. నట్టూ ఎంత త్వరగా కోలుకుంటే, టీమిండియాకు అంత మంచిది. మరోవైపు గాయంతో ఆస్ట్రేలియా టూర్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఫిట్‌నెస్ టెస్టు పూర్తి చేయడంలో విఫలమై, మరోసారి భారత జట్టుకి దూరం కానున్నాడు.

వరుణ్ చక్రవర్తితో పాటు రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా కూడా బీసీసీఐ ప్రవేశపెట్టిన 2 కి.మీ.ల కొత్త ఫిట్‌నెస్ టెస్టును పూర్తి చేయలేకపోయారని సమాచారం. దీంతో వీరి స్థానంలో రాహుల్ చాహార్‌ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది బీసీసీఐ. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !