విదేశీ ఆటగాళ్ల సెండాఫ్: బెంగళూరు, హైదరాబాద్, రాజస్ధాన్‌లకు కష్టమే

By Siva KodatiFirst Published Apr 24, 2019, 5:59 PM IST
Highlights

ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్ల మెరుపులు ఇక చూడలేం.. ప్రపంచకప్‌ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టుకు ఎంపికైన వారిని స్వదేశం నుంచి వచ్చేయాల్సిందిగా ఆయా దేశాల బోర్డులు ఆదేశించాయి. దీంతో ప్రపంచకప్‌లో పాల్గొనే ఆటగాళ్లంతా ఐపీఎల్‌ను వీడనున్నారు

ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్ల మెరుపులు ఇక చూడలేం.. ప్రపంచకప్‌ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టుకు ఎంపికైన వారిని స్వదేశం నుంచి వచ్చేయాల్సిందిగా ఆయా దేశాల బోర్డులు ఆదేశించాయి. దీంతో ప్రపంచకప్‌లో పాల్గొనే ఆటగాళ్లంతా ఐపీఎల్‌ను వీడనున్నారు.

స్వదేశానికి వెళుతున్న ఆటగాళ్లలో బెంగళూరు, హైదరాబాద్, రాజస్ధాన్ నుంచి ఎక్కువ మంది ఉన్నారు. ఎన్నో మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించిన ఆటగాళ్లు జట్టుకు దూరమవుతుండటంతో ఫ్రాంఛైజీలు ఆందోళన చెందుతున్నాయి.

అయితే ఇందులో విండీస్, న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్లకు మినహాయింపు లభించింది. వెస్టిండీస్ ఇప్పటి వరకు ప్రపంచకప్‌ జట్టును ప్రకటించలేదు. అలాగే న్యూజిలాండ్, ఆఫ్గానిస్తాన్ ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌లో కొనసాగనున్నారు. 

జట్ల వారీగా ఐపీఎల్‌ను వీడనున్న ఆటగాళ్లు వీరే:

సన్ రైజర్స్ హైదరాబాద్:

డేవిడ్ వార్నర్
జానీ బెయిర్ స్టో
షకిబుల్ హాసన్

చెన్నై సూపర్‌కింగ్స్:

ఫాఫ్ డుప్లెసిస్
ఇమ్రాన్ తాహిర్

ముంబై ఇండియన్స్:

బెహ్రెండార్ఫ్
డికాక్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:

డేవిడ్ మిల్లర్

కోల్‌కతా నైట్‌రైడర్స్:

జో డెన్లీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

మొయిల్ అలీ
స్టోయినిస్
క్లసీన్
డేల్ స్టెయిన్

రాజస్థాన్ రాయల్స్:

జోస్ బట్లర్
స్టీవ్ స్మిత్
బెన్ స్టోక్స్
జొఫ్రా ఆర్చర్

ఢిల్లీ క్యాపిటల్స్:

రబాడా
 

click me!