సింపిల్ క్యాచ్ మిస్ చేసిన ధోనీ.. అభిమానులు షాక్..!

Published : Apr 29, 2021, 02:07 PM IST
సింపిల్ క్యాచ్ మిస్ చేసిన ధోనీ.. అభిమానులు షాక్..!

సారాంశం

ధోనీకి సమీపంలోకి బంతి వస్తే.. కచ్చితంగా ఔట్ అవ్వాల్సిందే. ఎలాంటి బంతినైనా ఇట్టే క్యాచ్ పట్టేస్తాడు.  ఐపీఎల్‌లో ఇప్పటి వరకు దాదాపు 150 మందిని అవుట్‌ చేశాడు.

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఎన్ని ఘనతలు సాధించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉంటూ మూడుసార్లు కప్ గెలిచిన ఘనత ఆయనది. బ్యాటింగ్ అదరగొడుతూనే... ఫీల్డింగ్ లోనూ ధోనీకి సాటి లేదు. ఇక వికెట్ కీపింగ్ లో ధోనీని మించినవారు లేరని అందరి అభిప్రాయం.

ధోనీకి సమీపంలోకి బంతి వస్తే.. కచ్చితంగా ఔట్ అవ్వాల్సిందే. ఎలాంటి బంతినైనా ఇట్టే క్యాచ్ పట్టేస్తాడు.  ఐపీఎల్‌లో ఇప్పటి వరకు దాదాపు 150 మందిని అవుట్‌ చేశాడు.

అయితే, బుధవారం నాటి మ్యాచ్‌లో మాత్రం సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ బెయిర్‌స్టో ఇచ్చిన సులువైన క్యాచ్‌ను ధోని డ్రాప్‌ చేయడం అభిమానులకు ఒకింత షాక్‌కు గురిచేసింది. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీపక్‌ చహర్‌ వేసిన రెండో బంతికే బెయిర్‌స్టోను అవుట్‌ చేసే అవకాశం వచ్చింది. కానీ, బంతి దిశను సరిగ్గా అంచనా వేయలేక ధోని పూర్తిగా ఎడమవైపునకు రావడంతో అతడి చేతుల్లో పడినట్లే పడి కిందపడిపోయింది. దీంతో బెయిర్‌స్టోకు లైఫ్‌ లభించింది.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘ఏంటీ.. ధోని క్యాచ్‌ డ్రాప్‌ చేశాడా? నేను నమ్మను.. ఒకవేళ అదే నిజమైతే అంతకంటే విచిత్రం ఏమీ ఉండదు. అమ్మో.. ఒకవేళ బెయిర్‌స్టోను గనుక తొందరగా అవుట్‌ చేసి ఉండకపోతే, ఏమయ్యేదో’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా,  ధోని క్యాచ్‌ మిస్‌ చేసినప్పటికీ, బెయిర్‌స్టో(7) మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నాలుగో ఓవర్‌లో సామ్‌ కరన్‌ బౌలింగ్‌లో చహర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.  ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో అత్యంత ఖరీదైన 6 ఆటగాళ్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?