మరి మీరు బంగ్లాదేశ్‌లో నదుల గురించి చర్చించుకున్నారా..? షకీబ్‌కు జర్నలిస్టు తిక్క ప్రశ్న..వీడియో వైరల్..

By Srinivas MFirst Published Nov 3, 2022, 11:36 AM IST
Highlights

T20 World Cup 2022: బుధవారం అడిలైడ్ ఓవల్ వేదికగా ముగిసిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ లో  టీమిండియా ఆఖరి ఓవర్లో  విజయం సాధించింది. వర్షం వల్ల ఆటంకం కలిగిన ఈ మ్యాచ్ లో బంగ్లా విజయానికి చేరువగా వచ్చినా ఆఖర్లో తడబడింది. 

టీ20 ప్రపంచకప్ లో భాగంగా  బుధవారం అడిలైడ్ ఓవల్ వేదికగా ముగిసిన ఉత్కంఠపోరులో భారత జట్టు థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో  అప్పటివరకు ఛేదనలో దూసుకుపోతున్న బంగ్లాదేశ్.. ఆ తర్వాత  ఒక్కసారిగా ఒత్తిడికి లోనైంది.  దూకుడుగా ఆడిన లిటన్ దాస్ నిష్క్రమించిన తర్వాత బంగ్లాదేశ్ జట్టు క్రమంగా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. అయితే వర్షం పడుతున్న సమయంలో బంగ్లా సారథి  షకిబ్ అల్ హసన్.. అంపైర్లతో పాటు భారత కెప్టెన్ రోహిత్ శర్మలతో కలిసి  కాసేపు  చర్చించాడు.  ఇక్కడ ఏం చర్చ  జరిగిందని  అడిగే క్రమంలో  ఓ జర్నలిస్టు..  షకిబ్ ను తిక్క  ప్రశ్నలడిగి విసిగించాడు.  

మ్యాచ్ ముగిసిన తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ కు షకిబ్ హాజరయ్యాడు.   మ్యాచ్ లో తాము ఓడిపోవడానికి గల కారణాలు, ఆటగాళ్ల ప్రదర్శన తదితర వివరాలన్నీ చెబుతుండగా మధ్యలో ఓ రిపోర్టర్ మైక్ తీసుకుని తిక్క ప్రశ్నలడిగాడు. ఆ సంభాషణ సాగిందిలా.. 

జర్నలిస్టు : వర్షం వచ్చిన తర్వాత మీరు ఆడొద్దని  ప్రయత్నించారా..? 
షకిబ్ : మాకు అటువంటి ఆప్షన్ కూడా ఉందా..? 
జర్నలిస్టు : లేదు. మరి మీరు వాళ్లను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారా..? 
షకిబ్ : కన్విన్సా..? ఎవరిని..? 
జర్నలిస్టు : అంపైర్స్, రోహిత్ శర్మలను
షకిబ్ : నాకు అంత సామర్థ్యం ఉందని మీరు అనుకుంటున్నారా..? 
జర్నలిస్టు : అవునా.. మరి మీరు  అక్కడ ఏం చర్చించుకున్నారు. బంగ్లాదేశ్ లో నదుల గురించి మాట్లాడుకున్నారా..? 
షకిబ్ ఈ ప్రశ్న అర్థం కానట్టు ఏం సమాధానం చెప్పలేదు. మళ్లీ జర్నలిస్టు మైక్ అందుకుని.. ‘మీరు  బంగ్లాదేశ్ లో నదులు, వాటి ప్రవాహాల గురించి అంపైర్, రోహిత్ శర్మలతో చర్చించారా..?  మీరేం మాట్లాడుకున్నారు..? మాకు కొంచెం చెబుతారా..? 
షకిబ్ : సరే.. మీరు సరైన ప్రశ్న వేశారు. అంపైర్లు నన్ను, రోహిత్ ను పిలిచి మ్యాచ్ పరిస్థితి, టార్గెట్, ఓవర్ల గురించి చర్చించారు.  అందుకు సంబంధించిన నిబంధనలను వివరించారు. 
జర్నలిస్టు : అంతేనా.. దానికి మీరు ఒప్పుకున్నారా..? 
షకిబ్ :  అవును. మరి ఇంకేం చేయను..? 
జర్నలిస్టు : బ్యూటిఫుల్, థ్యాంక్యూ..! అని ముగించాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

కాగా జర్నలిస్టు వైఖరిపై  బంగ్లాదేశ్ ఫ్యాన్స్ తో పాటు  క్రికెట్ ప్రేమికులు కూడా మండిపడుతున్నారు. షకిబ్ ఓపికగా సమాధానాలు చెబుతుంటే  సదరు పాత్రికేయుడు పిచ్చి ప్రశ్నలతో విసిగించడం కరెక్ట్ కాదని.. అయినా అంపైర్ తో ఏం మాట్లాడుకున్నారో ఇతడికి చెప్పాల్సిన అవసరం లేదని వాపోతున్నారు.  

 

Shakib Beautifully reverted to shameless and arrogant journalist

— Dheeraj Sharma (@5wordslove)
click me!