హైదరబాదీల ప్రేమకు ఫిదా అయిన పాక్ క్రికెటర్

By telugu news team  |  First Published Sep 30, 2023, 10:39 AM IST

రిజ్వాన్ ఇదే తొలి భారత్ మ్యాచ్ కావడం విశేషం. ఇంతకముందు ఆసియాకప్ లో రిజ్వాన్  పెద్దగా  ఆకట్టుకోలేకపోయాడు.  ఇప్పుడు మాత్రం సెంచరీ చేసితో అదరగొట్టాడు.


వన్డే ప్రపంచకప్ లో భాగంగా హైదరాబాద్ లోని న్యూజిలాండ్ తో పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ అదరగొట్టాడు. ఏకంగా సెంచరీ చేశాడు. కేవలం 92 బంతుల్లో ఆయన సెంచరీ పూర్తి చేశాడు. వరల్డ్ కప్ త్వరలో ఉంది అనగా,  ఈ వార్మప్ మ్యాచ్ లో మహమ్మద్ రిజ్వాన్ ఇలా సెంచరీ చేయడం టీమ్ కి చాలా మంచి బలాన్ని ఇచ్చింది.

రిజ్వాన్ ఇదే తొలి భారత్ మ్యాచ్ కావడం విశేషం. ఇంతకముందు ఆసియాకప్ లో రిజ్వాన్  పెద్దగా  ఆకట్టుకోలేకపోయాడు.  ఇప్పుడు మాత్రం సెంచరీ చేసితో అదరగొట్టాడు.

Latest Videos

undefined

కాగా, మ్యాచ్ తర్వాత రిజ్వాన్ చాలా సంతోషం వ్యక్తం చేశాడు. సెంచరీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేయడంతో పాటు, హైదరాబాద్ లో అభిమానులు చూపించిన ప్రేమకు కూడా ఫిదా అయిపోయాడు.  సెంచరీ చేయడం పట్ల తనకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందని చెప్పాడు. పాకిస్తాన్ కోసం సెంచరీ చేయడం తనకు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుందన్నాడు. అయితే, పాకిస్తాన్ లో తమ ఫ్యాన్స్  తమకు చాలా ప్రేమ  చూపిస్తారని, అదే ప్రేమను హైదరాబాద్ లో చూశానని చెప్పారు.  హైదరాబాద్ విమానాశ్రయంలో తమకు హైదరాబాదీలు చెప్పిన స్వాగతం తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు.  ఇండియాలో చాలా అద్భుతంగా ఉందని చెప్పాడు. 

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, టాస్ ఓడి పాకిస్తాన్ బ్యాటింగ్ కి దిగింది. మొదట బ్యాటింగ్ మొదలుపెట్టగా వెంట వెంటనే ఔట్ అవ్వడంతో పాక్ టీమ్ కష్టాల్లో పడింది. ఇమాద్ వసీం, అబ్దుల్లా షఫీక్ వెంటనే వెంటనే పెవిలియన్ కి చేరారు. దాని తర్వాత క్రీజులోకి వచ్చిన రిజ్వాన్, కెప్టెన్ బాబర్ అజామ్ తో కలిసి టీమ్ ని నిలపెట్టారు, వీరిద్దరూ కలిసి  114 పరుగుల భాగస్వామిని నెలకొల్పారు. ఎప్పటిలాగానే రిజ్వాన్ సెటిల్ అయ్యేందుకు సమయం తీసుకున్నా, తర్వాత తన స్వీప్ షాట్లతో న్యూజిలాండ్ టీమ్ కి చుక్కలు చూపించాడు. బాబర్ అజామ్ కూడా చాలా నిలకడగా నిలపడటం వల్ల, టీమ్ కి హెల్ప్ అయ్యింది. 

click me!