Hardik Pandya : ఐపీఎల్ 2024 లో ముంబై ప్రారంభం అస్సలు బాగోలేదు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉంది. అతని కెప్టెన్సీ బాగులేదనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
Mumbai Indians - Hardik Pandya : ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ ముందుంటుంది. ఎందుకంటే ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవడంతో పాటు పలుమార్లు ఫైనల్ కు చేరుకుంది. ఇదంతా కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీ జరిగింది. ఐపీఎల్ లో ముంబైని విజయవంతమైన టీమ్ గా ముందుకు నడిపించిన రోహిత్ శర్మను తొలగించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది ముంబై ఫ్రాంఛైజీ.
అయితే, హార్దిక్ పాండ్యా టీమ్ లోకి ఎంటరైన తర్వాత నుంచి ముంబై జట్టు హాట్ టాపిక్ గా మారింది. ఐపీఎల్ 2024లో ప్రారంభంలోనే వరుస ఓటములతో చెత్త రికార్డును నమోదుచేసింది. దీనికి తోడూ కెప్టెన్ సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదనీ, అందుకే ముంబై ఓటములతో ముందుకు సాగుతున్నదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్సీని రోహిత్ శర్మకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాజస్థాన్ తో జరిగిన మూడో మ్యాచ్ లో కూడా ముంబై జట్టు ఓటమిపాలైంది.
ముంబై వరుస ఓటములపై తీవ్ర విమర్శలు, ట్రోల్స్ ను ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిస్తూ ఓటమికి గల కారణాలపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. సరైన విధంగా గేమ్ ను ముందుకు తీసుకెళ్లలేకపోయామని చెప్పాడు. క్రమశిక్షణతో ముందుకు సాగాల్సిన అవసరముందని చెప్పాడు. 'మేము కోరుకున్న విధంగా మ్యాచ్ ను ప్రారంభించలేదు. మేము 150 లేదా 160కి చేరుకోవడానికి మంచి స్థితిలో ఉన్నామని నేను భావిస్తున్నాను, కానీ నా వికెట్ ఆటను మార్చిందని' చెప్పాడు.
పూరన్ ఉంటే పూనకాలే.. కొడితే స్టేడియం బయటపడ్డ బాల్..
దీని తర్వాత మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వైపు తిరిగిందని అభిప్రాయపడ్డాడు. ''నేను ఇంకా బాగా చేయగలనని అనుకుంటున్నాను. బౌలర్లు కొంత సహాయం తీసుకోవడం మంచిది. ఇదంతా సరైన పనులు చేయడంతో అనుకూల ఫలితాలు కొన్నిసార్లు జరుగుతాయి. కొన్నిసార్లు ఇది జరగదు. జట్టుగా మేము మరింత మెరుగ్గా చేయగలమని నమ్ముతున్నాము, అయితే మనం కొంచెం క్రమశిక్షణతో ఉండాలి. మరింతగా మన ధైర్యాన్ని ప్రదర్శించాలని'' హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.
ఎవడ్రా ఈ మయాంక్ యాదవ్.. కోహ్లీ కొంపముంచాడు.. !