RCB vs LSG: ఐపీఎల్ 2024లో 14వ మ్యాచ్ లో బెంగళూరును లక్నో టీమ్ చిత్తుగా ఓడించింది. మయాంక్ యాదవ్ దెబ్బకు విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ మూడో ఓటమిని చవిచూసింది.
RCB vs LSG - IPL 2024 : భారీ అంచనాలున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ వరుస ఓటములతో ఐపీఎల్ 2024ను కొనసాగిస్తోంది. ఇప్పటికే రెండు ఓటములతో ఉన్న ఆర్సీబీ హోం గ్రౌండ్ లో దుమ్మురేపాలనుకుంది కానీ, లక్నో టీమ్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్దిండ్ మూడు విభాగాల్లోనూ అద్భుతమైన ఆటతీరుతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. స్టార్ ప్లేయర్ క్వింటన్ డీకాక్ 81 పరుగులు తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. నికోలస్ పూరాన్ చివరలో దుమ్మురేపే ఇన్నింగ్స్ ఆడాడు. 21 బంతుల్లో 40 పరుగులు సాధించాడు.
182 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీకి మంచి ప్రారంభం లభించింది. అయితే, విరాట్ కోహ్లీ ఔట్ అయిన తర్వాత ఆర్సీబీ ప్లేయర్లలో ఒక్కరు కూడా బిగ్ ఇన్నింగ్స్ ను ఆడలేకపోయాడు. లక్నో బౌలర్లు నిప్పులు చెరగడంతో వరుసగా ఆర్సీబీ ప్లేయర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. 153 పరుగులకు ఆలౌట్ అయింది. ముఖ్యంగా యంగ్ పేసర్ మయాంక్ యాదవ్ మరోసారి తన బౌలింగ్ తో హడలెత్తించాడు. బెంగళూరు ఆటగాళ్లకు తన బుల్లెట్ బౌలింగ్ తో చెమటలు పట్టించాడు. అరంగేట్రం మ్యాచ్ లో దుమ్మురేపే బౌలింగ్ చేసిన మయాంక్ యాదవ్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లోనూ మరోసారి తన బౌలింగ్ తో అదరగొట్టాడు. కీలకమైన మూడు వికెట్లు తీసుకుని బెంగళూరు టీమ్ పతనాన్ని శాసించాడు. 4 ఓవర్ల బౌలింగ్ చేసిన మయాంక్ యాదవ్ 3 వికెట్లు తీసుకున్నాడు. కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మ్యాచ్ విన్నింగ్ ఆటతో ఆకట్టుకున్న మయాంక్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఎవరీ మయాంక్ యాదవ్..?
మయాంక్ యాదవ్ ఢిల్లీకి చెందిన ప్లేయర్. ఈ 21 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్ అరంగేట్రంలో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో 3 వికెట్లు తీసుకున్నాడు. స్థిరంగా 150 kmph వేగంతో బౌలింగ్ వేస్తూ అందరగొడుతున్నాడు. తన ఐపీఎల్ తొలి మ్యాచ్ లో155.8 kmph వేగంతో వేగంగా బంతిని వేసి ఐపీఎల్ 2024లో సరికొత్త రికార్డు సృష్టించాడు. దేశవాళీ సర్క్యూట్‌లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మయాంక్ యాదవ్ విజయ్ హజారే ట్రోఫీ లో రాణించాడు. 2022లోనే ఐపీఎల్ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది కానీ, ఆడే అవకాశం రాలేదు. గత సంవత్సరం గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమయ్యాడు. ఈ సీజన్ లో మళ్లీ 20 లక్షలకు లక్నో అతన్ని దక్కించుకుంది.
నన్నే సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగిస్తారా.. బ్యాట్‌తో క్వింటన్ డికాక్ విధ్వంసం
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 4 గేమ్‌లలో 5 వికెట్లు తీశాడు. సెమీఫైనల్‌లో కూడా ఢిల్లీ అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో 5 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీశాడు. 2023 దేవధర్ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిలో ఒకడు. నార్త్ జోన్ జట్టులో ఎంపికైన మయాంక్ తన నిప్పులు చెరిగే పేస్‌తో బ్యాటర్‌లను ఇబ్బంది పెట్టాడు. 5 మ్యాచ్ లలో 17.58 సగటుతో 12 వికెట్లు తీశాడు. ఈ యంగ్ ప్లేయర్ ఇప్పటి వరకు ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ గేమ్ ఆడాడు. డిసెంబర్ 2022లో రంజీ ట్రోఫీలో మహారాష్ట్రపై ఆడి రెండు వికెట్లు తీసుకున్నాడు.
ఢిల్లీకి చెందిన మయాంక్ గతంలో దేశవాళీ క్రికెట్‌లో తన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. 10 T20 మ్యాచ్‌లు, 17 లిస్ట్ ఏ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ రికార్డులను కలిగివున్నాడు. మొత్తం 46 వికెట్లు పడగొట్టాడు. తన తొలి అరంగేట్ర ప్రదర్శనతో పాటు, మయాంక్ యాదవ్ ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన ప్లేయర్ గా నిలిచాడు. 155.8 కి.మీ వేగంలో బౌలింగ్ చేసిన ఈ ప్లేయర్ తన తొలి వికెట్ ను పంజాబ్ మ్యాచ్ లో 12వ ఓవర్‌లో జానీ బెయిర్‌స్టో పెవిలియన్ కు పంపాడు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన మయాంక్ యాదవ్ 12 డాట్ బాల్స్ వేయడంతో పాటు 3 కీలకమైన వికెట్లు తీసుకున్నాడు.
Hat-trick wickets: బౌలింగ్ సంచలనం.. టీ20 క్రికెట్ లో హ్యాట్రిక్ సాధించిన 21 ఏళ్ల యంగ్ ప్లేయర్