Undertaker: అలాగైతే నువ్వో నేనో తేల్చుకుందాం రా..! బాలీవుడ్ స్టార్ హీరోకు సవాల్ విసిరిన అండర్‌టేకర్‌

Published : Nov 22, 2021, 05:46 PM IST
Undertaker: అలాగైతే నువ్వో నేనో తేల్చుకుందాం రా..! బాలీవుడ్ స్టార్ హీరోకు సవాల్ విసిరిన అండర్‌టేకర్‌

సారాంశం

Akshay kumar-UnderRaker: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. డబ్ల్యూడబ్ల్యూఈ లో తలపడబోతున్నాడా..? కెరీర్ ప్రారంభంలో యాక్షన్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈ హీరో.. డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ అండర్‌టేకర్‌ తో పోటీ పడబోతున్నాడా..? 

అండర్‌టేకర్‌.. ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్ లో సచిన్ టెండూల్కర్, ఫుట్ బాల్ లో క్రిస్టియానో రొనాల్డో ఎలాగో.. డబ్ల్యూడబ్ల్యూఈలో అండర్‌టేకర్‌ అంతకంటే ఘనకీర్తిని సాధించుకున్నాడు. అయితే ఈ లెజెండరీ ప్లేయర్ తాజాగా బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు ఓ సవాల్ విసిరాడు. టైం చెప్పు, నువ్వెప్పుడు రమ్మన్నా నేను రెడీ.. అంటూ అతడికి సవాల్ విసిరాడు. ఈ ఇద్దరి మధ్య సాగిన ట్వీట్లు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అసలేమైందంటే..? 

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) నటించిన కిలాడియోంకాకిలాడీ (KhiladiyonKaKhiladi) సినిమా  విడుదలై 25 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘కిలాడియోంకాకిలాడీ విడుదలై రేపటికి 25 ఏండ్లు పూర్తికాబోతుంది. ఈ సందర్భంగా నేనొక ఆసక్తికర విషయం పంచుకోదల్చుకోనున్నాను. ఈ చిత్రంలో ది అండర్‌టేకర్‌గా నటించింది రెజ్లర్ బ్రియాన్ లీ..’అంటూ రాసుకొచ్చాడు. 

 

కాగా.. ఈ  ట్వీట్ కు రియల్ అండర్‌టేకర్‌ (Undertaker) రిప్లై ఇచ్చాడు. అతడు స్పందిస్తూ.. ‘హా..!  నీకు టైం దొరికినప్పుడు చెప్పు మనం రియల్ మ్యాచ్ ఆడదాం..’ అని  కామెంట్ చేశాడు. దీనికి అక్షయ్ కూడా ఫన్నీగా స్పందించాడు.  ‘నేను నా ఇన్సూరెన్స్ ను చెక్ చేసుకున్నాక మీకు రిప్లై ఇస్తా బ్రో..’ అని రిప్లై పంపాడు.  రెండు రంగాలకు చెందిన దిగ్గజాలకు  సంబంధించిన ఈ ట్విట్టర్ వార్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నది. 

 

1990లో డబ్ల్యూడబ్ల్యూఈ ఆడటం మొదలుపెట్టిన అండర్‌టేకర్‌..  గతేడాది 2020 దాకా రింగ్ లో ప్రత్యర్థులను గడగడలాడించాడు. 30 సంవత్సరాల పాటు ప్రత్యర్థులపై పిడిగుద్దులు విసురుతూ.. రింగ్ లోకి దిగాడంటే విజయం పక్కా.. అనేంత స్థాయిలో కీర్తి సంపాదించుకున్నాడు. అండర్‌టేకర్‌ ఏడు సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్ కాగా.. ఆరుసార్లు  ట్యాగ్ టీమ్ ఛాంపియన్, ఒకసారి రాయల్ రంబుల్ విజేతగా నిలిచాడు. 

ఇక అక్షయ్ కుమార్ కిలాడియోంకాకిలాడీ సినిమాలో రీల్ అండర్‌టేకర్‌గా నటించిన బ్రియాన్ లీ.. రియల్ అండర్‌టేకర్‌ కు కజిన్. అతడి అసలు పేరు మార్క్ కాల్వే. సినిమా కోసం అతడిని అండర్‌టేకర్‌ గా చూపించారు. 1996లో విడుదలైన ఈ సినిమా అక్షయ్ కెరీర్ కు ఎంతో ప్లస్ అయింది. ఈ సినిమాతో అతడు యాక్షన్ హీరో ఇమేజీని సొంతం చేసుకున్నాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !