సూపర్ మార్కెట్‌ సిబ్బందితో గొడవపడ్డ క్రికెటర్ రాజేశ్వరి గైక్వాడ్‌... సీసీటీవీ ఫుటేజ్ వీడియో వైరల్...

By Chinthakindhi RamuFirst Published Dec 1, 2022, 3:39 PM IST
Highlights

కర్ణాటకలోని విజయపురలో ఓ సూపర్ మార్కెట్‌ సిబ్బందిపై దాడి చేసిన రాజేశ్వరి గైక్వాడ్... మనుసులతో వచ్చి, వాగ్వాదం, గొడవ! 

భారత మహిళా క్రికెట్ టీమ్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ ఓ వివాదంలో ఇరుక్కుంది. కర్ణాటకకు చెందిన రాజేశ్వరి గైక్వాడ్, ప్రస్తుతం విజయపుర ఏరియాలో నివాసం ఉంటుంది. అదే ఏరియాలో ఉన్న ఓ సూపర్ మార్కెట్‌కి వెళ్లిన రాజేశ్వరి గైక్వాడ్‌కి అక్కడి సిబ్బందితో ఏదో విషయమై గొడవ జరిగింది. సిబ్బందితో వాగ్వాదానికి దిగిన రాజేశ్వరి గైక్వాడ్, అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత మరికొంత మంది మనుషులతో కలిసి వచ్చి సూపర్ మార్కెట్‌ సిబ్బందిపై దాడి చేసింది...

సూపర్ మార్కెట్‌లో నమోదైన ఈ సంఘటన ఆధారంగా భారత మహిళా క్రికెటర్‌పై కేసు నమోదు చేయాలని భావించారు పోలీసులు. అయితే ఇరు వర్గాలు పోలీసు కంప్లైంట్ లేకుండానే సమస్యని పరిష్కరించుకున్నాడు. స్వల్పంగా గాయపడిన సిబ్బందికి రాజేశ్వరి గైక్వాడ్ క్షమాపణలు చెప్పిందని, దీంతో పోలీసు కేసు పెట్టకుండానే గొడవను ఇరువర్గాలు పరిష్కరించుకున్నట్టు సమాచారం...

అయితే ఫిర్యాదు చేయడానికి పోలీసులకు షేర్ చేసిన సీసీ టీవీ వీడియో ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే సంఘటన జరిగిన ప్రాంతానికి వేరే వైపు సీసీటీవీ ఉండడంతో సూపర్ మార్కెట్ సిబ్బందిపై ఎవరు దాడి చేసింది? ఎంత మంది వచ్చారనే వివరాలు మాత్రం ఈ వీడియోలో కనిపించకుండడం లేదు. దాడి చేసిన వైపు సీసీటీవీ కెమెరాలు లేవా? ఉన్నా పనిచేయడం లేదా? లేక పని చేస్తున్నా ఆ ఫుటేజీని డిలీట్ చేశారా? అనే అనుమానాలు రేగుతున్నాయి...

India women's cricketer Rajeshwari Gayakwad involved in altercation at super market pic.twitter.com/ZDDxqWfiW1

— Sanju Here 🤞👻 (@me_sanjureddy)

2014 జనవరిలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సీనియర్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్, ఇప్పటిదాకా టీమిండియా తరుపున 2 టెస్టులు, 64 వన్డేలు, 44 టీ20 మ్యాచులు ఆడింది...

వన్డేల్లో 99 వికెట్లు తీసిన రాజేశ్వరి గైక్వాడ్, 44 టీ20 మ్యాచుల్లో 54 వికెట్లు తీసింది. టెస్టుల్లో 5 వికెట్లు తీసింది. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 158 వికెట్లు తీసిన రాజేశ్వరి గైక్వాడ్, 2022 వుమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌తో పాటు కామన్వెల్త్ గేమ్స్ 2022 టోర్నీలోనూ టీమిండియా తరుపున ఆడింది.. 

click me!