బాక్సింగ్ డే టెస్టులో చరిత్ర సృష్టించిన టీమిండియా... ప్రతీకారం తీర్చుకున్న రహానే టీమ్...

Published : Dec 29, 2020, 09:24 AM IST
బాక్సింగ్ డే టెస్టులో చరిత్ర సృష్టించిన టీమిండియా... ప్రతీకారం తీర్చుకున్న రహానే టీమ్...

సారాంశం

8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న టీమిండియా... 1-1 తేడాతో నాలుగు టెస్టుల సిరీస్‌ను సమం చేసిన భారత జట్టు... మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో టీమిండియాకి నాలుగో విజయం...

రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకి ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసిన భారత జట్టు... 70 పరుగుల విజయ లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి చేధించింది. యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 35 పరుగులు చేయగా, కెప్టెన్ అజింకా రహానే 27 పరుగులతో రాణించాడు. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసింది టీమిండియా.

కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకుండా, తొలి టెస్టులో చెత్త ప్రదర్శనను మరిపిస్తూ... రెండో టెస్టులో అద్భుతంగా రాణించింది టీమిండియా. ముఖ్యంగా కెప్టెన్‌గా అజింకా రహానే జట్టును నడిపించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఈ టెస్టుతో కలిపి మూడు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన అజింకా రహానే.. మూడు మ్యాచుల్లోనూ టీమిండియాకు విజయాలను అందించాడు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకి ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేసింది. మొదటి మ్యాచ్ ఆడుతున్న సిరాజ్ 5 వికెట్లతో రాణించగా, మరో మొదటి మ్యాచ్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటుతో రాణించాడు. 

PREV
click me!

Recommended Stories

ఐపీఎల్ ముద్దు.. హనీమూన్ వద్దు.. నమ్మకద్రోహం చేసిన ఆసీస్ ప్లేయర్.. పెద్ద రచ్చ జరిగేలా ఉందిగా
విదేశీ లీగ్‌ల్లో ఆడనున్న రో-కో.. ఐపీఎల్ చైర్మన్ ఏమన్నారంటే.?