పంత్ చెప్పినట్టే... ధోనీని గుర్తుకు తెచ్చిన రిషబ్ పంత్... వీడియో వైరల్..

Published : Dec 26, 2020, 04:24 PM ISTUpdated : Dec 26, 2020, 04:25 PM IST
పంత్ చెప్పినట్టే... ధోనీని గుర్తుకు తెచ్చిన రిషబ్ పంత్... వీడియో వైరల్..

సారాంశం

వికెట్ల వెనకాల హిందీలో కామెంటరీ ఇస్తూ ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టిన రిషబ్ పంత్... పంత్ చెప్పినట్టే బౌలింగ్ చేసి మాథ్యూ వేడ్ వికెట్ తీసిన రవిచంద్రన్ అశ్విన్...

ఆడిలైడ్ ఘోర పరాభవాన్ని మరిచిపోయిన టీమిండియా, మొదటి రోజు పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ముఖ్యంగా కెప్టెన్‌గా వ్యవహారించిన అజింకా రహానే, కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్‌తో ఫుల్లు మార్కులు కొట్టేస్తే, రిషబ్ పంత్ తన స్టైల్‌లో వికెట్ల వెనకాల కామెంటరీతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టాడు.

అంతేకాదు మహేంద్ర సింగ్ ధోనీలా ఏ బ్యాట్స్‌మెన్‌కి ఎలా బౌలింగ్ చేయాలో కూడా చెప్పి, బౌలర్లకి సలహాలు ఇచ్చాడు రిషబ్ పంత్. మొదటి నుంచి దూకుడుగా ఆడిన మాథ్యూ వేడ్‌ను అవుట్ చేసేందుకు పంత్ ఇచ్చిన ఐడియా భలేగా వర్కవుట్ అయ్యింది. 

రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు వేడ్. దీంతో వికెట్ల లోపలికి వేయాలని హిందీలో సూచించాడు రిషబ్ పంత్. ఆ తర్వాతి బంతి అశ్విన్ అలాగే వేయడ, వేడ్ భారీ షాట్‌కి ప్రయత్నించడంతో బంతి గాల్లోకి లేచింది.

శుబ్‌మన్ గిల్ అడ్డు వచ్చినా, తడబడకుండా క్యాచ్ అందుకున్నాడు రవీంద్ర జడేజా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !