విరాట్ కోహ్లీ ఓ చెత్త కెప్టెన్...కానీ: గంభీర్ ఘాటు వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Apr 9, 2019, 6:57 PM IST
Highlights

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ముందుకు నడిపించడంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ పూర్తిగా విఫలమయ్యాడని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విమర్శించాడు. కెప్టెన్ గా అతడి అనాలోచిత తప్పుడు నిర్ణయాల వల్లే చాలాసార్లు ఆర్సిబి ఓటమిపాలయ్యిందని ఆరోపించారు. కోహ్లీ గొప్ప బ్యాట్ మెన్ కావచ్చు కానీ గొప్ప కెప్టెన్ మాత్రం కాదన్నాడు. డొంకతిరుగుడు లేకుండా చెప్పాలంటే అతడో చెత్త కెప్టెన్ అంటూ కోహ్లీపై గంభీర్ విమర్శలకు దిగాడు. 
 
ఇటీవల ఆర్సిబి భారీ పరుగులు సాధించి కూడా కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలవ్వడానికి కూడా కోహ్లీనే కారణమని గంభీర్ ఆరోపించారు. రస్సెల్స్ చివరి ఓవర్లలో పేస్ బౌలర్లపై చెలరేగుతున్న సమయంలో స్పిన్నర్లను ఉపయోగించి వుండాల్సిందని అన్నాడు. పేస్ బౌలర్లపై రస్సెల్స్ సమర్థవంతంగా ఎదుర్కొంటాడన్న విషయం ఐపిఎల్ ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసని గంభీర్ పేర్కొన్నాడు. కెప్టెన్ అన్నాక సమయోచితంగా వ్యవహరిస్తూ జట్టులోని ప్రతి ఆటగాడిని ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకోవాలని సూచించారు.  

కోల్‌కతా మ్యాచ్ లో రస్సెల్స్ విజృంభణను అడ్డుకోడానికి మరో అవకాశాన్నికలిగివుండి కూడా కోహ్లీకి దాన్ని ఉపయోగించుకోలేకపోయాడన్నాడు. సిరాజ్ స్థానంలో స్టోయినీస్ ను కాకుండా పవన్ నేగితో బౌలింగ్ చేయిస్తే ఫలిత మరోలా వుండేదని అభిప్రాయపడ్డారు. ఈ తప్పులన్నీ కోహ్లీ చేసి ఓటమికి మాత్రం బౌలర్లను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని గంభీర్ ప్రశ్నించాడు. 

కాబట్టి ఆర్సీబి ఓటమికి బౌలర్లపై నిందలు వేయవద్దని కోహ్లికి గంభీర్ సూచించాడు. తనను తాను విమర్శించుకోలేకే అతడు బౌలర్లపై నిందలు వేస్తున్నాడని అన్నాడు. ఇకనైనా తన తప్పుల గురించి తెలుసుకుని కెప్టెన్ గా ఆర్సిబికి మంచి విజయాలు అందించాలని కోరుకుంటున్నట్లు గంభీర్ వెల్లడించారు.  
 
click me!