ఐపిఎల్ కు వరల్డ్ కప్ తో సంబంధం లేదు: టీమిండియా చీఫ్ సెలెక్టర్

By Arun Kumar PFirst Published Apr 9, 2019, 4:14 PM IST
Highlights

ప్రపంచ కప్ కు ముందు జరుగుతున్న ఐపిఎల్ ద్వారా తమ సత్తా చాటుతున్న ఆటగాళ్లకు టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ షాకిచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, ప్రపంచ కప్ కు ఎలాంటి సంబంధం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రపంచ కప్ కోసం భారత జట్టు ఎంపికలో ఈ లీగ్ లో ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకోవడం లేదని అన్నారు. దీంతో ఐపిఎల్ లో రాణించడం ద్వారా ప్రపంచ కప్ జట్టులో స్ధానం దక్కించుకోవాలని భావిస్తున్న భారత ఆటగాళ్లకు ప్రసాద్ వ్యాఖ్యలు ఆందోళనను కలిగిస్తున్నాయి. 

ఇప్పటికే వరల్డ్ కప్ కోసం భారత జట్టు ఎంపికపై తాము ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చామన్నారు. గతకొంతకాలంగా స్వదేశంలో, విదేశాల్లో టీమిండియా తరపున రాణించిన ఆటగాళ్లకే తుది జట్టులో అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆటగాళ్ల ఫిట్ నెస్, ఫామ్, విదేశాల్లో రాణించగల సామర్ధ్యం ఆదారంగానే ఎంపిక వుటుందని ప్రసాద్ స్పష్టం చేశారు. 

సోమవారం బిసిసిఐ క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ప్రపంచకప్‌ కోసం భారత ఆటగాళ్లను ఎంపిక చేయడానికి సెలెక్షన్ కమిటీకి సిఓఏ ఈ నెల 15 వరకు సమయమిచ్చింది. అదే రోజు ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన భారత తుది జట్టును ప్రకటించనున్నట్లు బిసిసిఐ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో అప్పటివరకు జరిగిన  ఐపిఎల్ మ్యాచుల్లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుంటారని  అందరూ భావిస్తున్న సమయంలో ప్రసాద్ షాకింగ్ విషయాన్ని భయటపెట్టారు. 

ఇదే అభిప్రాయాన్ని టీమిండియా, ఆర్సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తం చేసిన  విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రదర్శనను ప్రపంచ కప్ జట్టు ఎంపిక  కోసం పరిగణిస్తారని తాను అనుకోవడం లేదని కోహ్లీ ఇప్పటికే వెల్లడించగా తాజాగా ఎమ్మెస్కే ఈ మాటలను బలపర్చారు.  టీమిండియా కెప్టెన్, చీఫ్ సెలక్టర్ మాటలను బట్టి చూస్తే ఈ ఐపిఎల్ ఎంత బాగా రాణించినా భారత ఆటగాళ్లకు ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు లేవన్నమాట.
 
click me!