సన్స్ రైజర్స్‌పై వ్యూహమిదే...అందుకే గెలిచాం: పంజాబ్ బౌలర్

By Arun Kumar PFirst Published Apr 9, 2019, 5:53 PM IST
Highlights

వరుస విజయాలతో దూసుకుపోతూ ఐపిఎల్ సీజన్ 12 ను ఘనంగా ఆరంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి రెండు మ్యాచుల్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు కింగ్స్ లెవెన్ పంజాబ్ చేతిలో ఓటమిని చవిచూసింది. ఇలా సన్ రైజర్స్ జట్టును  ఓడించడానికి తాము ముందుగానే తగిన వ్యూహాలను రచించి బరిలోకి దిగినట్లు పంజాబ్ బౌలర్ అంకిత్ రాజ్‌పుత్ వెల్లడించాడు. 

 సన్ రైజర్స్ ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో లు చెలరేగకుండా నియంత్రించడమే తమ ప్రధాన వ్యూహమని అంకిత్ తెలిపాడు. దాన్ని సమర్థవంతంగా అమలుచేయడం వల్లే మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఓపెనర్ బెయిర్ స్టో ను ఆరంభంలోనే అడ్డుకోవడంలో సఫలమయ్యామని అన్నాడు. 

ఇక మరో ఓపెనర్ వార్నర్ చివరివరకు ఆడినా స్వేచ్చగా తనదైన స్పీడ్ ఇన్సింగ్ ఆడకుండా ఇబ్బందిపెట్టగలిగామని అన్నారు. అందువల్లే వార్నర్ 70 పరుగులు చేసినా అందుకోసం ఎక్కువ బంతులను ఆడాడన్నారు. ఇలా కేవలం 150 పరుగులకే హైదరాబాద్ జట్టును కట్టడి చేసి విజయాన్ని అందుకున్నట్లు అంకిత్ తెలిపాడు. 

పంజాబ్ బౌలర్లందరం లైన్ ఆండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేయడంవల్లే హైదరాబాద్ బ్యాట్ మెన్స్ ని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం సాధ్యమైందన్నారు. పంజాబ్ బ్యాట్ మెన్స్  రాహుల్, అగర్వాల్ అర్థశతకాలను సాధించి బ్యాటింగ్ లోనూ మెరిసారని అన్నాడు. తమ బౌలర్లు, బ్యాట్ మెన్స్ సమిష్టిగా రాణించి జట్టుకు ఓ మంచి విజయాన్ని అందించారని అంకిత్‌ రాజ్‌పుత్‌ తెలిపాడు.  

సోమవారం రాత్రి ఛండీగఢ్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌  నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు మరో బంతి మిగిలుండగానే విజయాన్ని అందుకుంది.  కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి పంజాబ్ జట్టును విజయ తీరాలకు చేర్చారు. 

click me!