కోహ్లీ కంటే శ్రేయాస్ బెటర్...అందుకే జట్టులో చోటు: అనిల్ కుంబ్లే సంచలనం

By Arun Kumar PFirst Published May 12, 2019, 4:31 PM IST
Highlights

టీమిండియా కెప్టెన్ గా అద్భుతంగా రాణిస్తున్న విరాట్ కోహ్లీ  ఐపిఎల్ విషయానికి వచ్చే సారథిగా ఫెయిల్ అవుతున్నాడు. భారత జట్టులో మాదిరిగానే ఐపిఎల్ లో కూడా బ్యాట్ మెన్ గా అద్భుతాలు చేస్తున్నా కెప్టెన్ గా మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు విజయాలను అందించలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఇతడి సారథ్యంలోని ఆర్సిబి జట్టు ఒక్క ఐపిఎల్ టైటిల్ ను కూడా సాధించలేకపోవడమే కెప్టెన్ గా కోహ్లీ వైఫల్యాన్ని తెలియజేస్తుంది. ఇలా వరుసగా విఫలమవుతూ అపఖ్యాతిని  సంపాదించిన కోహ్లీ మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే  మరో షాక్ ఇచ్చారు.  
 
ఐపిఎల్ సీజన్-12 చివరి దశకు చేరుకున్న సందర్భంగా కుంబ్లే అత్యుత్తమ ఆటగాళ్లతో ఓ ఐపిఎల్ జట్టును ప్రకటించాడు. ఈ సీజన్ 12 లో అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్న ఆటగాళ్లకు తన డ్రీమ్ టీం లో చోటు కల్పించాడు. అయితే ఈ జట్టులో ఆర్సిమి కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటు కల్పించలేదు. దీంతో కుంబ్లే  ఐపిఎల్ జట్టుపై విశ్లేషకుల్లోనే కాదు  అభిమానుల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. 

కెప్టెన్ గా విఫలమైన కోహ్లీకి కనీసం బ్యాట్  మెన్ గా అయినా స్థానం కల్పించాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కుంబ్లే ఉద్దేశపూర్వకంగానే కోహ్లీకి తన డ్రీం టీమ్ లో చోటు కల్పించలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇలా కోహ్లీ అభిమానులు, నెటిజన్లు కుంబ్లే ను టార్గెట్ గా చేసుకుని  సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. 

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ పేరు తెచ్చుకున్న  మహేంద్ర సింగ్ ధోనికి కుంబ్లే తన జట్టు కెప్టెన్ బాధ్యతలు అప్పగించాడు. అలాగే వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా అతడికే  అప్పగించాడు. డిల్లీ కిలాడీ రిషబ్ పంత్‌కు కూడా తన జట్టులో చోటిచ్చినా అతన్ని స్పెషలిస్ట్ బ్యాట్ మెన్ గానే ఎంపిక చేసినట్లు కుంబ్లే వెల్లడించారు. 

 తన జట్టులో కోహ్లిని చోటు కల్పించకపోవడంపై కూడా కుంబ్లే క్లారిటీ ఇచ్చాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ డిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గానే కాకుండా  బ్యాట్ మెన్ గా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాడని... జట్టు  కష్టాల్లో వున్న ప్రతీసారి చక్కగా ఆడాడని గుర్తుచేశాడు. అందువల్లే కోహ్లి కంటే అయ్యర్‌ బెటరని భావించి అతడికి తన జట్టులో చోటు కల్పించానని కుంబ్లే వివరించాడు.   

click me!