హైదరాబాద్‌లో ఐపిఎల్ ఫైనల్... అభిమానులకు పోలీసుల సూచనలివే

By Arun Kumar PFirst Published May 11, 2019, 9:05 PM IST
Highlights

ఐపిఎల్ సీజన్ 12 చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఫైనల్ తో ఈ సీజన్ కు తెరపడనుంది. దీంతో ఈ ఏడాది జరుగుతున్న చివరి ఐపిఎల్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తెలుగు క్రికెట్ ప్రియులు ఉవ్విళ్లూరుతున్నారు. ముంబూ ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్  లో టీమిండియా హేమీహేమీ క్రికెటర్లు ధోని, రోహిత్ మైదానంలో దర్శనమివ్వనున్నారు. దీంతో అభిమానుల్లో ఈ మ్యాచ్ పై మరింత ఆసక్తి పెరిగింది. 

ఐపిఎల్ సీజన్ 12 చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఫైనల్ తో ఈ సీజన్ కు తెరపడనుంది. దీంతో ఈ ఏడాది జరుగుతున్న చివరి ఐపిఎల్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తెలుగు క్రికెట్ ప్రియులు ఉవ్విళ్లూరుతున్నారు. ముంబూ ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్  లో టీమిండియా హేమీహేమీ క్రికెటర్లు ధోని, రోహిత్ మైదానంలో దర్శనమివ్వనున్నారు. దీంతో అభిమానుల్లో ఈ మ్యాచ్ పై మరింత ఆసక్తి పెరిగింది. 

ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో పూర్తి కెపాసిటీ సీట్ల కోసం టికెట్ల అమ్మకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో ఆటగాళ్లు, వీఐపిలు, సామాన్య అభిమానుల రక్షణ  కోసం గట్టి  బందోబస్లు ఏర్పాటు చేసినట్లు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఆయన ఇవాళ వివిధ  విభాగాలకు చెందిన పోలీస్ అధికారులతో కలిసి ఉప్పల్ స్టేడియాన్ని సందర్శించారు. అక్కడ  జరుగుతున్న బందోబస్తు ఏర్పాట్లను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. 

ఈ సందర్భంగా మ్యాచ్ చూడటానికి వచ్చే అభిమానులకు ఆయన కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా స్టేడియంలో చేపట్టిన బందోబస్తు చర్యలను ముందుగానే  తెలుసుకుని పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. అంతేకాకుండా అనుమానిత పదార్థాలు, వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. 

మైదానంలోకి  అనుమతించని వస్తువులు;

ల్యాప్ టాప్,  బ్యానర్లు, వాటర్ బాటిల్స్, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానికి  వస్తువులు, అగ్గిపెట్టె, లైటర్, పదునైన వస్తువులు(ఇనుము,  ప్లాస్టిక్ ఏవైనా), బైనాక్యులర్, కరెన్సీ నాణేలు, పెన్నులు, ఎటక్ట్రిక్  బ్యాటరీలు, హెల్మెట్లు, సుగంధ పదార్థాలు, బ్యాగులు, బయటి ఆహార పదార్థాల ను అభిమానులు వెంటతీసుకెళ్లకూడదని తెలిపారు. తాము పేర్కొన్న పధార్థాలే కాకుండా ఇతర ఏవైన  అనుమానిత పదార్థాలున్నా అనుమతించబోమని...అందువల్ల భద్రతా అధికారులకు సహకరించాలని కమీషనర్ అభిమానులను  కోరారు. 

పార్కింగ్ స్థలాలు;

సొంత  వాహనాల్లో  వచ్చే అభిమానులు  ఇతరులకు ఇబ్బంది కలగకుండా  వాహనాలను  కేటాయించిన స్థలంలోనే పార్క్ చేయాలని కమీషనర్ కోరారు. గేట్1,2 కార్ పాస్ కలిగినవారు రామంతాపూర్ వైపు నుండి వచ్చి స్టేడియంలోని ఎ,బి స్థలాల్లో తమ  వాహనాలను పార్క్ చేసుకోవాలి. 

మ్యాచ్ ను చూడటానికి వచ్చే కార్ పాస్ కలిగిన  దివ్యాంగులు గేట్ నెంబర్ 3 నుండి మైదానంలోకి  ప్రవేశించి పార్కింగ్ స్థలం  బి వద్ద  కారును నిలిపి లోపలికి వెళ్లవచ్చు. 

ఇక జి4  నుండి జి10 గేట్ పాస్ కలిగిన అభిమానులు హబ్సిగూడ వైపునుండి వచ్చి  జెన్ పాక్ట్, రామంతాపూర్ చర్చ్,  శక్తి సోప్స్ జనరల్ వద్దగల పార్కింగ్ స్థలాల్లో వాహనాలు  నిలపవచ్చు. 

మ్యాచ్ జరిగే సమయంలో హబ్సిగూడ మీదుగా వెళ్లే భారీ వాహనాలను  దారి మళ్లించనున్నారు. 

వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని క్రికెట్ అభిమానులతో పాటు సామాన్య  నగరవాసులుు కూడా పోలీసులకు సహకరించాలని  కమీషనర్ మహేష్ భగవత్ సూచించారు.     
 

click me!