సఫారీలతో టీ20, వన్డే సిరీస్... భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ...

Published : Feb 27, 2021, 02:31 PM IST
సఫారీలతో టీ20, వన్డే సిరీస్... భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ...

సారాంశం

కరోనా బ్రేక్ తర్వాత సౌతాఫ్రికాతో ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లు ఆడనున్న భారత జట్టు... వన్డే జట్టుకి కెప్టెన్‌గా మిథాలీరాజ్, టీ20 సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ... 

లాక్‌డౌన్ కారణంగా కొన్ని నెలలుగా నిలిచిపోయిన మహిళల క్రికెట్ కూడా మళ్లీ ప్రారంభం కాబోతోంది. కరోనా బ్రేక్ తర్వాత ఎట్టకేలకు సౌతాఫ్రికా జట్టుతో ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లు ఆడబోతోంది భారత జట్టు.

మార్చి 7 నుంచి మొదలయ్యే ఈ సిరీస్ కోసం సౌతాఫ్రికా మహిళా జట్టు, భారత్‌కి రానుంది. ఈ రెండు సిరీస్‌ల కోసం జట్టును ప్రకటించింది ఆల్ ఇండియా వుమెన్స్ సెలక్షన్ కమిటీ. వన్డే జట్టుకి సీనియర్ మిథాలీ రాజ్ కెప్టెన్‌గా వ్యవహారిస్తే, టీ20 సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహారించనుంది.

టీ20 జట్టుకి స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహారిస్తే, వన్డే టీమ్‌కి హర్మన్‌ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్‌గా ఉంటుంది. మార్చి 7 నుంచి 23 వరకూ సాగే వన్డే, టీ20 సిరీస్‌ మ్యాచులన్నీ లక్నో వేదికగానే జరుగుతాయి.

భారత మహిళా జట్టు (వన్డే):

మిథాలీ రాజ్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, పూనమ్ రౌత్, ప్రియా పూనియా, యస్తిక భటియా, హర్మన్‌ప్రీత్ కౌర్, హేమలత, దీప్తి శర్మ, సుష్మా వర్మ, స్వేతా వర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, జులన్ గోస్వామి, మన్షీ జోషి, పూనమ్ యాదవ్, ప్రత్యూష, మోనికా పాటిల్

భారత టీ20 మహిళా జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, సఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియాల్, సుష్మా వర్మ, నుజత్ పర్వీన్, అయూషీ సోనీ, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, మన్షీ జోషి, మోనికా పటేల్, ప్రత్యూష, సిమ్రాన్ దిల్ బహదూర్

PREV
click me!

Recommended Stories

Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !