నాలుగో టెస్టు నుంచి తప్పుకున్న జస్ప్రిత్ బుమ్రా... వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరం...

Published : Feb 27, 2021, 02:08 PM ISTUpdated : Feb 27, 2021, 02:10 PM IST
నాలుగో టెస్టు నుంచి తప్పుకున్న జస్ప్రిత్ బుమ్రా... వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరం...

సారాంశం

వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి తప్పించాల్సిందిగా కోరిన బుమ్రా... బుమ్రాను టెస్టు జట్టు నుంచి విడుదల చేసిన బీసీసీఐ... టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో కూడా లేని బుమ్రా... 

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, నాలుగో టెస్టు జట్టు నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో తనను నాలుగో టెస్టు నుంచి తప్పించాల్సిందిగా బీసీసీఐ కోరాడు బుమ్రా. దీంతో అతనికి విశ్రాంతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. టెస్టు సిరీస్ తర్వాత జరిగే టీ20 సిరీస్‌లో కూడా బుమ్రాకి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.

బుమ్రా విశ్రాంతి తీసుకోవడానికి కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత కారణాలు చూపించడంతో టీ20 సిరీస్‌ ఆడకుండా, నాలుగో టెస్టు నుంచి కూడా తప్పుకున్నాడంటే...  బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నాడా? అనే అనుమానాలు కూడా రేగుతున్నాయి.

బుమ్రా స్థానంలో అదనపు ప్లేయర్‌ను తీసుకోవడం లేదని ప్రకటించింది బీసీసీఐ. బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్ లేదా ఉమేశ్ యాదవ్ బరిలో దిగే అవకాశం ఉంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రాకి ఒక్క ఓవర్ వేసే అవకాశం కూడా రాలేదు.

PREV
click me!

Recommended Stories

Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !