‘‘పుష్ప.. పుష్పరాజ్, మే ఝుకేగా నహీ’’... పుష్ప క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చాహల్ , వీడియో వైరల్

Siva Kodati |  
Published : Feb 10, 2022, 09:59 PM IST
‘‘పుష్ప.. పుష్పరాజ్, మే ఝుకేగా నహీ’’... పుష్ప క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చాహల్ , వీడియో వైరల్

సారాంశం

ప్రతి ఒక్కరూ తగ్గేదే లే అంటూ పుష్ప సినిమాలో బన్నీ చేసినట్లుగా గడ్డం కింద చేయి పెట్టుకుని డైలాగ్ చప్పేస్తూ వీడియోలు చేసేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ చేరాడు. ‘పుష్ప.. పుష్పరాజ్. మే ఝుకేంగ్ నహీ’ అని చెబుతూ బన్నీ మేనరిజమ్‌ను ఆయన అనుకరించాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా (allu arjun) సుకుమార్ దర్శకత్వంలో (sukumar) తెరకెక్కిన ‘‘పుష్ప’’ సినిమా (pushpa movie) ఇప్పుడు దేశాన్ని ఊపేస్తోంది. ఎక్కడ ఏ మూలకు వెళ్లినా.. ఈ సినిమా గురించే చర్చ. అంతేకాదు.. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా పుష్ప సినిమాను వాడేసుకుంటున్నారు. ముఖ్యంగా పుష్ప సినిమాలోని తగ్గేదేలే అన్న డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ప్రతి ఒక్కరూ తగ్గేదే లే అంటూ బన్నీ చేసినట్లుగా గడ్డం కింద చేయి పెట్టుకుని డైలాగ్ చప్పేస్తూ వీడియోలు చేసేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ చేరాడు.

ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అతడు షేర్ చేసిన రీల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘పుష్ప.. పుష్పరాజ్. మే ఝుకేంగ్ నహీ’ అని చెబుతూ బన్నీ మేనరిజమ్‌ను చాహల్ అనుకరించాడు. ఈ వీడియోకు ఏకంగా 1.7 లక్షల లైకులు, బోల్డన్ని కామెంట్స్ వచ్చాయి. చాహల్ వీడియో చూసిన నెటిజన్లు ఇరగదీశావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘పుష్పరాజ్ క్లబ్‌లోకి స్వాగతం’ అంటూ ఓ అభిమాని ఆహ్వానించాడు

ఇకపోతే ఇటీవల ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల(Uttarakhand Assembly Elections) ప్రచారంలో పాల్గొన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Union Minister Rajnath Singh) పుష్ప({Pushpa) సినిమానూ ప్రస్తావిస్తూ ‘‘తగ్గేదే లే’’ అంటూ డైలాగ్ విసిరారు. 

‘ఈ రోజుల్లో ఒక సినిమా గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. అదే ఆ సినిమా పేరు పుష్ప. పుష్కర్ పేరు విని కూడా కాంగ్రెస్ మిత్రులు అదొక పుష్పం మాత్రమే అని భావిస్తున్నారు. కానీ, వారికి నేను ఒక విషయం తెలియజేస్తున్నాను. ఈ పుష్కర్ ధామి ఒక పుష్పమే కాదు.. ఫైర్ కూడా. పుష్కర్ ధామిని ఎక్కడ ఆగిపోడు. ఎవరి ముందూ తలవంచడు. ఎవరూ ఆయనను ఆపలేరు’ అని పేర్కొన్నారు. 

‘కాంగ్రెస్‌కు అసలు ఒక నేతనే లేడని విమర్శించారు. ఒక నేత లేడు.. ఒక ఉద్దేశ్యం లేదు.. ఒక నినాదం లేదు. కాంగ్రెస్ కేవలం దేశాన్ని దోచుకున్నది. రాష్ట్రాన్ని కూడా దోచుకుంది. కానీ, ఇకపై ఈ రాష్ట్రాన్ని మరోసారి కాంగ్రెస్ దోచుకోనివ్వం. వారి వాగ్దానాలు పచ్చి అబద్ధాలు. ప్రతి హామీ అబద్ధమే’ అని కేంద్ర మంత్రి అన్నారు.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !