అందుకే నిన్ను తీసుకోలేదు.. బోర్డు రాజకీయాలకు నువ్వు బలి.. టీమిండియా వికెట్ కీపర్ కు మద్దతు తెలిపిన కీర్మాణీ

Published : Feb 10, 2022, 04:58 PM IST
అందుకే నిన్ను తీసుకోలేదు.. బోర్డు రాజకీయాలకు నువ్వు బలి.. టీమిండియా వికెట్ కీపర్ కు మద్దతు తెలిపిన కీర్మాణీ

సారాంశం

Wriddhiman Saha: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ను శ్రీలంక పర్యటన నుంచి తప్పించడంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. కెరీర్ చరమాంకంలో ఉన్న అతడికి కనీసం..   

త్వరలో జరుగబోయే శ్రీలంక టెస్టు సిరీస్ కు టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను సెలెక్టర్లు పక్కనబెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సాహాతో పాటుగా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ, వెటరన్ బ్యాటర్లు అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారాలకు కూడా  రాబోయే టెస్టు సిరీస్ లో చోటు దక్కడం కష్టమే అని వాళ్లకు వ్యక్తిగతంగా  చెప్పేశారు. అయితే  రహానే, పుజారాల సంగతి పక్కనబెడితే.. వికెట్ కీపర్ సాహాకు మాత్రం ఇది షాకింగే. కెరీర్ చరమాంకంలో ఉన్న అతడిపై ఇలా వ్యవహరించడంపై భిన్నాభిప్రాయాలు  వ్యక్తమవుతున్నాయి. 

ఇదే విషయమై భారత్ కు తొలి ప్రపంచకప్ అందించిన జట్టులోని వికెట్ కీపర్ సయ్యిద్ కీర్మాణీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోర్డు రాజకీయాలకు సాహా బలయ్యాడని సంచలన కామెంట్స్ చేశాడు. 

ఓ స్పోర్ట్స్ ఛానెల్ తో కీర్మాణీ మాట్లాడుతూ.. ‘సాహా ఇప్పటికీ బెస్ట్ వికెట్ కీపర్ అనడంలో సందేహమే లేదు. కానీ రిషభ్ పంత్ అగ్రెసివ్ గా ఆడుతుండటంతో ఛాన్సులు దక్కించుకుంటున్నాడు.  కానీ 37 ఏండ్ల వయసులో కూడా సాహా బాగా ఆడుతున్నాడు. అతడు నిరాశ పడాల్సింది లేదు. గతంలో దినేశ్ కార్తీక్,  పార్థీవ్ పటేల్ లపై కూడా ఇలాగే వ్యవహరించారు. 

 

కొన్నేండ్లుగా  భారత జట్టుకు నువ్వు చేసిన సేవలేంటో క్రికెట్ అభిమానులకు తెలుసు. అయితే బీసీసీఐ, డ్రెస్సింగ్ రూమ్ లోని ఏ  గ్రూపుతో నీకు సంబంధం లేదు.  అందుకే నిన్ను తొలగించారు.బోర్డు రాజకీయాలకు నువ్వు బలయ్యావు. కానీ  నేను మాత్రం నిన్ను ఎప్పటికీ బెస్ట్ వికెట్ కీపర్ గానే గుర్తుంచుకుంటాను..’ అని తెలిపాడు.

కాగా.. శ్రీలంక టూర్ కు ముందు   సాహాను తప్పించడంపై క్రికెట్ ఫ్యాన్స్ కూడా సెలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత క్రికెట్ కు నిస్వార్థ సేవలు చేసిన సాహాను ఇక జట్టులోకి తీసుకోకుంటే.. కనీసం అతడిని పిలిచి  గౌరవంగా సాగనంపాల్సింది పోయి ఇలా వ్యవహరించడం మంచిది కాదని అంటున్నారు. 

 

ఇదే విషయమై క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే స్పందిస్తూ.. ‘ఒకవేళ సాహా ను మనం తిరిగి భారత జట్టులో చూడకుంటే  అతడి సేవలను మనం గుర్తించి తీరాలి. అతడు ప్రపంచ స్థాయి వికెట్ కీపర్. నావరకైతే 2017లో శ్రీలంక పర్యటనలో అతడు గొప్ప  ప్రదర్శన చేశాడు..’ అని ట్విట్టర్ లో  రాసుకొచ్చాడు. 

2010లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచుతో  అరంగ్రేటం చేసిన సాహా.. భారత్ తరఫున 40 టెస్టులాడాడు. బ్యాటర్ గా 1,353 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక వికెట్ కీపర్ గా 104 మందిని  పెవిలియన్ కు పంపాడు. ఇందులో 92 క్యాచులు, 12 స్టంప్ అవుట్ లు ఉన్నాయి. ధోని నీడలో ఎదిగిన సాహా.. మహీ తప్పుకున్నాక భారత జట్టుకు రెగ్యులర్ వికెట్ కీపర్ అయ్యాడు. కానీ కొంతకాలానికే రిషభ్ పంత్ రూపంలో అతడి స్థానానికి ముప్పు వాటిల్లింది. జాతీయ జట్టు నుంచి తప్పించారని తెలియగానే సాహా.. బెంగాల్ తరఫున రంజీల నుంచి కూడా తప్పుకున్నాడు. సాహా కెరీర్ దాదాపు ముగిసినట్టే అని భారత క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !