కెప్టెన్ అయ్యాక బాగానే గిట్టుబాటు అయినట్టుందిగా.. లంబోర్ఘిని కార్ కొన్న హిట్ మ్యాన్.. ధర ఎంతో తెలుసా..?

Published : Mar 01, 2022, 06:03 PM IST
కెప్టెన్  అయ్యాక బాగానే గిట్టుబాటు అయినట్టుందిగా.. లంబోర్ఘిని కార్ కొన్న హిట్ మ్యాన్.. ధర ఎంతో తెలుసా..?

సారాంశం

Rohit Sharma Buys Lamborghini Urus: గతేడాది ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో రోహిత్ శర్మ ను ముంబై ఇండియన్స్ రూ. 16 కోట్లు వెచ్చించి దక్కించుకున్న విషయం తెలిసిందే.  ఇక జాతీయ జట్టు తరఫున ఆడుతూ అతడు వరుసగా మూడు బ్యాక్ టు బ్యాక్ సిరీస్ లలో...  

టీమిండియాకు అన్ని ఫార్మాట్లకు  సారథిగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ ప్రస్తుతం శ్రీలంకతో టెస్టు సిరీస్ కు  సిద్ధమవుతున్నాడు. ఇటీవలే స్వదేశంలో వెస్టిండీస్ ను  వన్డే, టీ20లలో చిత్తు చేసిన రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. ఆదివారం లంకతో ముగిసిన  మూడు మ్యాచుల  టీ20  సిరీస్ ను కూడా వైట్ వాష్ చేసింది.  లంకతో టెస్టు సిరీస్ లకు ముందు అతడు వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. అయితే అది ఆటకు  సంబంధించిన విషయాల మీద కాదు.  ఇటీవలే అతడు అత్యంత ఖరీదైన  లంబోర్ఘిని సిరీస్ కొత్త మోడల్ ను కొనుగోలు చేశాడు. 

లంబోర్ఘిని కొత్త మోడల్.. ‘ఉరుస్’ ను హిట్ మ్యాన్ కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు కొత్త వాహనాలకు సంబంధించిన విషయాలను వెల్లడించే.. ఆటోమొబైలియర్డెంట్  తన ఇన్స్టా  ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. రోహిత్ కొన్న ఉరుస్ కు సంబంధించిన ఫోటోలను  అభిమానులతో పంచుకుంది. దీని ధర రూ. 3.10 కోట్లు అని సమాచారం. 

‘టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ లంబోర్ఘిని బ్రాండ్ న్యూ మోడల్ అయిన ఉరుస్ ను కొన్నాడు..!  ముంబైలోని లంబోర్ఘిని షోరూం ఇప్పటికే ఈ కారును రోహిత్  ఇంటికి డెలివరీ చేసింది.  భారత జట్టు జెర్సీ కలరైన  నీలి రంగు కారును  కొనుగోలు చేశాడు..’ అని ఆటోమొబిలియర్డెంట్ పేర్కొంది.

 

రూ. 3 కోట్ల విలువ చేసే ఈ కారుకు మెన్ ఇన్ బ్లూ జెర్సీ  రంగు  బ్లూ కలర్ నే కావాలని  కొనుక్కున్నాడట రోహిత్.. ‘కార్టూక్’ తెలిపిన సమాచారం మేరకు.. బయట బ్లూ కలర్ ఉన్న కారుకు  లోపల కూడా తనకు నచ్చినట్టుగానే డిజైన్ చేసుకున్నాడు హిట్ మ్యాన్.  చెర్రీ రెడ్ కలర్ లో సీట్లు  ఉన్న ఈ కారుకు క్యాబిన్ మాత్రం బ్లాక్ కలర్ లో డిజైన్ చేయించాడు.

వరుసగా మూడు బ్యాక్ టు బ్యాక్ సిరీస్ విజయాలతో  పాటు టీ20లలో వరుసగా 12 విజయాలు సాధించిన భారత జట్టు.. మార్చి 4 నుంచి లంకతో టెస్టు మ్యాచు ఆడనున్నది. మొహాలీ  వేదికగా జరిగే ఈ మ్యాచ్.. టీమిండియా మాజీ సారథి  విరాట్ కోహ్లికి వందో టెస్టు కానుంది.   ఇదిలాఉండగా.. గతేడాది ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో ముంబై ఇండియన్స్ జట్టు  రోహిత్ శర్మను రూ. 16 కోట్లు వెచ్చించి దక్కించుకున్న విషయం తెలిసిందే.  ఐపీఎల్ లో ముంబైకి 5 ట్రోఫీలు అందించిన సారథిగా రోహిత్ కు మంచి రికార్డుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు