టీమిండియాకి మరో ఎదురుదెబ్బ... ఆటగాళ్ల ఫీజులో 20 శాతం కోత...

By team teluguFirst Published Nov 28, 2020, 2:50 PM IST
Highlights

భారీగా పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్లు...

ఆర్టికల్ 2.22 ఐసీసీ నియమాల ప్రకారం ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించిన ఐసీసీ...

తప్పును అంగీకరించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ..

ఆసీస్ టూర్‌ను ఓటమితో ఆరంభించిన భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేటు కారణంగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది ఐసీసీ. సిడ్నీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ వన్డే మ్యాచ్‌లో భారత జట్టు బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు.

యజ్వేంద్ర చాహాల్ 89 పరుగులు, నవ్‌దీప్ సైనీ 83 పరుగులు సమర్పించుకోవడంలో ఫీల్డింగ్ మార్పులకు చాలా సమయం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. వేయాల్సిన నెట్ ఓవర్ రేట్ కంటే గంటకి ఒక ఓవర్‌ తక్కువగా వేయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగియడానికి దాదాపు 36 నిమిషాలు అదనపు సమయం పట్టింది.

దీంతో ఆర్టికల్ 2.22 ఐసీసీ కోర్డు ప్రకారం ప్లేయర్లు, సిబ్బందికి 20 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించింది ఐసీసీ. విరాట్ కోహ్లీ తన తప్పును అంగీకరించడంతో ఎలాంటి విచారణ లేకుండా జరిమానా విధించింది ఐసీసీ. మొదటి వన్డే పరాభవం నుంచి కోలుకోకముందే జరిమానా రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది భారత జట్టుకి. 

click me!