అంబటి రాయుడు రిటైర్మెంట్....బిసిసిఐకి భావోద్వేగంతో కూడిన లేఖ

By Arun Kumar P  |  First Published Jul 3, 2019, 10:23 PM IST

భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ప్రపంచ కప్ ఆటగాళ్ల ఎంపిక నుండి తాజాగా జరిగిన సంఘటన వరకు అడుగడుగునా అతడిపై బిసిసిఐ, సెలెక్టర్లు పక్షపాతం ప్రదర్శించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మొదట నిలకడగా రాణిస్తున్న రాయుడిని కాదని సెలెక్టర్లు తమిళనాడు ఆలౌ రౌండర్ విజయ్ శంకర్ ను ప్రపంచ కప్ కు ఎంపికచేశారు. రాయుడిని స్టాండ్ బై ఆటగాడిగా ప్రకటించారు. అయితే అప్పుడే తీవ్ర మనోవేదనకు గురైన అతడు త్రీడి కళ్లద్దాలతో ఈ ప్రపంచ కప్ చూస్తానంటూ సెలెక్టర్లపైనే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

అయితే తాజాగా విజయ్ శంకర్ గాయంతో ప్రపంచ కప్ కు దూరమైనా సెలెక్టర్లు రాయుడుకు అవకాశమివ్వలేదు. ముందుగా స్టాండ్ బై గా ప్రకటించిన రాయుడును కాదని మయాంక్ అగర్వాల్ కు ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పించారు. ఇలా రెండోసారి కూడా సెలెక్టర్లు మొండిచేయి చూపించడాన్ని తట్టుకోలేక రాయుడు తనకెంతో ఇష్టమైన క్రికెట్ కెరీర్ ను వదులుకున్నారు. తన రిటైర్మెంట్ కు సంబంధించి బిసిసిఐకి అతడు ఓ ఉద్వేగపూరిత లేఖ రాశాడు. 

Latest Videos

''నేను ఇకపై అంతర్జాతీయ క్రికెటర్ గా కొనసాగకూడదని నిర్ణయించుకున్నాను. అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల(టెస్ట్, వన్డే, టీ20) నుండి తప్పుకుంటున్నాను. ఇంతకాలం తనను భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి సహకరించిన మీకు(బిసిసిఐ) ధన్యవాదాలు. అలాగే నాకు రంజీల్లో ఆడే అవకాశాన్ని కల్పించిన హైదరాబాద్, ఆంధ్ర, బరోడా, విధర్బ క్రికెట్ సంఘాలకు కృతజ్ఞతలు. అలాగే ఐపిఎల్ ఆడే అవకాశాన్ని కల్పించిన చెన్నై, ముంబై జట్టు యాజమాన్యాలకు కూడా ధన్యవాదాలు. ఇక నన్ను క్రికెటర్ గా తీర్చిదిద్దడానికి కష్టపడ్డ తల్లిదండ్రులకు, ప్రేమను పంచిన అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. 

 క్రికెటర్ గా నా ప్రతిభను నమ్మి మంచి అవకాశాలు కల్పించిన సహచరులు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మలకు కృతజ్ఞతలు. క్రికెట్ ద్వారా భారత దేశానికి సేవ చేసుకునే అరుదైన అవకాశం నాకు లభించిది.  అందుకు నేనెంతో గర్వపడుతున్నా. అయితే ఇప్పుడు తనకెంతో ఇష్టమైన క్రికెట్ ను వదులుకోవాల్సి రావడం బాధగా వున్నా తప్పడం లేదు. ఇన్నిరోజులు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు చెబుతున్నా'' అంటూ రాయుడు భావోద్వేగంతో కూడిన లేఖను బిసిసిఐకి పంపించాడు. 
 
click me!