టీమిండియాను ఓడించిన నో బాల్... ఆఖరి బంతికి సౌతాఫ్రికా విజయం...

By team teluguFirst Published Mar 21, 2021, 10:45 PM IST
Highlights

వరుసగా రెండో టీ20లోనూ ఓడిన టీమిండియా...

భారత మహిళా జట్టుకి వరుసగా ఐదో పరాజయం...

రెండో టీ20లో ఆఖరి బంతికి విజయాన్ని అందుకున్న సిరీస్ దక్కించుకున్న సౌతాఫ్రికా...

వన్డే సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోయిన టీమిండియా, టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి సిరీస్ కోల్పోయింది. రెండో టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు, 158 పరుగుల భారీ స్కోరు చేసినా, పరాజయం తప్పలేదు. 

కెప్టెన్ స్మృతి మంధాన మరోసారి 7 పరుగులే చేసి నిరాశ పరచగా, సఫాలీ వర్మ 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి అవుట్ అయ్యింది. హార్లీన్ డియోల్ 31 పరుగులు చేయగా రోడ్రిగ్స్ 16, రిచా గోష్ 26 బంతుల్లో 8 ఫోర్లతో 44 పరుగులు చేసింది.

159 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన సౌతాఫ్రికా, సరిగా ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. లిజెల్లీ లీ 45 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 70 పరుగులు చేయగా లౌరా వోల్వర్ట్ 39 బంతుల్లో 7 ఫోర్లతో 53 పరుగులు చేసింది.

ఆఖరి ఓవర్‌లో విజయానికి 9 పరుగులు కావాల్సి ఉండగా, మొదటి నాలుగు బంతుల్లో 3 పరుగులు మాత్రమే ఇచ్చిన అరుంధతి రెడ్డి, ఐదో బంతిని నో బాల్‌‌గా వేయడం, సౌతాఫ్రికా వుమెన్ పరుగులు తీయడంతో అదనంగా మరో రెండు పరుగులు  వచ్చాయి. దీంతో చివరి రెండు బంతుల్లో 3 పరుగులు చేసి సౌతాఫ్రికా విజయాన్ని అందుకుంది. 

click me!