భారత్‌తో వన్డే సిరీస్: ఇంగ్లాండ్‌కు షాక్, రాజస్థాన్‌కు కూడా..!!

By Siva KodatiFirst Published Mar 21, 2021, 8:32 PM IST
Highlights

ఇప్పటికే భారత్‌తో జరిగిన టెస్టు, టీ20 సిరీస్‌లు కోల్పోయి పరువు కోల్పోయిన ఇంగ్లాండ్‌కు వన్డే సిరీస్‌కు ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ దూరమయ్యాడు

ఇప్పటికే భారత్‌తో జరిగిన టెస్టు, టీ20 సిరీస్‌లు కోల్పోయి పరువు కోల్పోయిన ఇంగ్లాండ్‌కు వన్డే సిరీస్‌కు ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ దూరమయ్యాడు.

మోచేతి గాయంతో పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి ఆర్చర్‌ వైదొలిగాడు. ఈమేరకు ఆదివారం ప్రకటించిన ఇంగ్లాండ్ స్క్వాడ్‌లో ఆర్చర్‌కు చోటు దక్కలేదు. 14 మందితో కూడిన జట్టును ప్రకటించగా అందులో ఈ ఆఫ్రికా సంతతి బౌలర్‌కు విశ్రాంతి ఇస్తూ ఇంగ్లండ్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది.

దీంతో ఆర్చర్‌ స్వదేశానికి బయల్దేరేందుకు సిద్ధమయ్యాడు. కాగా, మంగళవారం నుంచి పుణె వేదికగా భారత్- ఇంగ్లాండ్‌ల మధ్య వన్డే సిరీస్‌ ఆరంభం కానుంది. ఆర్చర్‌ స్థానంలో జాక్‌ బాల్‌ కానీ, క్రిస్‌ జోర్డాన్‌లను కానీ తుది జట్టులోకి తీసుకుకోవాలని ఇంగ్లాండ్ యోచిస్తోంది.

కానీ దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. భారత్‌తో వన్డే సిరీస్‌కు సంబంధించి వీరు రిజర్వ్‌ ఆటగాళ్లగానే ఉన్నారు. మరోవైపు ఆర్చర్‌ గాయంతో రాజస్తాన్‌ రాయల్స్‌లో ఆందోళన మొదలైంది.

ఆర్చర్‌ ఎప్పటికి కోలుకుంటాడనే దానిపై స్పష్టత లేకపోవడంతో రాజస్తాన్‌ డైలమాలో పడింది. ఐపీఎల్‌ ఆరంభపు మ్యాచ్‌లకు సంబంధించి ఆర్చర్‌ అందుబాటులో ఉండే అవకాశం లేదు. రాజస్థాన్ జట్టులో ఆర్చర్ కీలక బౌలర్‌గా ఉన్నాడు.

గత ఏడాది కూడా పర్పుల్ క్యాప్ పోటీలో ఆర్చర్ నిలిచాడు. తన స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును వణికించే సత్తా ఉన్న బౌలర్ మిస్ అవడం రాజస్థాన్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు.

click me!