19 పరుగులకే 6 వికెట్లు... భారత టాపార్డర్‌ను కమ్మేసిన కమ్మిన్స్...

Published : Dec 19, 2020, 10:30 AM ISTUpdated : Dec 19, 2020, 10:33 AM IST
19 పరుగులకే 6 వికెట్లు... భారత టాపార్డర్‌ను కమ్మేసిన కమ్మిన్స్...

సారాంశం

4 వికెట్లు తీసిన ప్యాట్ కమ్మిన్స్...2 వికెట్లు తీసిన జోష్ హజల్‌వుడ్... టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా 20 పరుగుల లోపు 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా... 9 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్... 

పింక్ బాల్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన స్వల్ప ఆధిక్యంతో మురిసిపోయిన టీమిండియాకు ఊహించని షాక్ ఇచ్చాడు ప్యాట్ కమ్మిన్స్. ఓవర్ నైట్ స్కోరు 6/1 వద్ద ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా... వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.

నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చిన బుమ్రా 2 పరుగులు చేసి అవుట్ కాగా, ఛతేశ్వర్ పూజారా డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అజింకా రహానే కూడా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. 15 పరుగుల వద్దే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా.

ఓ బౌండరీ బాది ఖాతా ఓపెన్ చేసిన విరాట్ కోహ్లీ కూడా కమ్మిన్స్ బౌలింగ్‌లోనే అవుట్ కావడంతో 19 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది భారత జట్టు.

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?