ఏడాదంతా క్రికెట్ పండుగ.. ప్రతిష్టాత్మక సిరీస్‌లు, వన్డే వరల్డ్ కప్.. 2023లో టీమిండియా షెడ్యూల్ ఇదే..

By Srinivas MFirst Published Jan 1, 2023, 3:19 PM IST
Highlights

Team India Schedule 2023: గతేడాది (2022) భారత జట్టు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ద్వైపాక్షిక సిరీస్ లలో ఫర్వాలేదనిపించినా కీలకమైన ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ లలో మాత్రం  విఫలమైంది. ఇక ఈ ఏడాది (2023)  భారత్ ఆడబోయే మ్యాచ్‌ల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. 

గతేడాది పరాభావాలను మరిచిపోయి కొత్త సంవత్సరంలోకి  కోటి ఆశలతో అడుగిడింది టీమిండియా.  2022లో తప్పక సాధిస్తుందనుకున్న ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు అనూహ్యంగా చతికిలపడి అభిమానులకు తీవ్ర గుండెకోతను నిలిపింది.  అయితే ఈ ఏడాది ఆ లోటును తీర్చడానికి   ‘మెన్ ఇన్ బ్లూ’కు మంచి అవకాశాలున్నాయి.   ఈ ఏడాది టీమిండియాకు చాలా ముఖ్యం.  పలు ద్వైపాక్షిక సిరీస్ లు, ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వంటి మెగా టోర్నీలతో పాటు  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ కూడా ఆడాల్సి ఉంది. 

ఈ ఏడాది  భారత జట్టు  ఆడబోయే మ్యాచ్ లు,  తలపడే ప్రత్యర్థులు,  అందుకు సంబంధించిన షెడ్యూల్ వివరాలు కింది విధంగా ఉన్నాయి. జనవరి 3 నుంచి  భారత్  స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్ తో కొత్త ఏడాదిని ప్రారంభించనుంది.  

2023లో టీమిండియా షెడ్యూల్ :  

స్వదేశంలో శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ 
- జనవరి 3న తొలి టీ20 
- జనవరి 5న రెండో టీ20 
- జనవరి 7న మూడో టీ20
- జనవరి 10న తొలి వన్డే 
- జనవరి 12న రెండో వన్డే
- జనవరి 15న మూడో వన్డే 

న్యూజిలాండ్ తో.. 

- జనవరి 18న తొలి వన్డే 
- జనవరి 21న రెండో వన్డే 
- జనవరి 24న మూడో వన్డే 
- జనవరి 27న తొలి టీ20 
- జనవరి 29న రెండో టీ20
- ఫిబ్రవరి 01న మూడో టీ20 

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ (ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు) 

- ఫిబ్రవరి 9-14 తొలి టెస్టు 
- ఫిబ్రవరి 17-21 రెండో టెస్టు 
- మార్చి 1-5 మూడో టెస్టు 
- మార్చి 9-13 నాలుగో టెస్టు 
- మార్చి 17న తొలి వన్డే 
- మార్చి 19న రెండో వన్డే 
- మార్చి 22న మూడో వన్డే 

మార్చి చివరి మాసంలో ఐపీఎల్ మొదలై.. ఏప్రిల్ - మే నెలలలో కొనసాగనుంది. దీంతో అంతర్జాతీయ మ్యాచ్ లకు విరామం. ఆ తర్వాత   జూన్ లో  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరుగుతుంది. ఒకవేళ స్వదేశంలో ఆస్ట్రేలియాను 3-0తో ఓడిస్తే  భారత్ ఈ ఫైనల్ రేసులో ఉంటుంది. ఇందుకు సంబంధించిన తేదీలను ఐసీసీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

- జులై - ఆగస్టులో భారత జట్టు  వెస్టిండీస్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ విండీస్ తో రెండు టెస్టులు,  మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ మ్యాచ్ ల తేదీలు ఇంకా వెలువడలేదు. 

- సెప్టెంబర్ ‌లో ఆసియా కప్ జరగాల్సి ఉంది.  అయితే  ఈసారి ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహిస్తే (అధికారికంగా ఆతిథ్య దేశం అదే) తాము అక్కడికి వెళ్లబోమని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.   తటస్థ వేదిక అయితే ఆడతామని స్పష్టం చేసింది. దీనిపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. 

 

SCHEDULE FOR TEAM INDIA IN 2023!!           pic.twitter.com/F124MmYj0e

— Don Sports Updates (@DonSportsUpdate)

- ఆసియా కప్ తర్వాత అక్టోబర్ లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడనుంది.  ఈ సిరీస్ షెడ్యూల్ కూడా ఇంకా ఖరారు కాలేదు. 

అక్టోబర్, నవంబర్ లలో భారత్ లో వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. 1983, 2011లలో వన్డే ప్రపంచకప్ నెగ్గిన భారత్.. స్వదేశంలో జరుగబోయే మెగా టోర్నీని సొంతం చేసుకుని మూడో టైటిల్ నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 

- ప్రపంచకప్ ముగిసిన తర్వాత నవంబర్ - డిసెంబర్ లలో ఆస్ట్రేలియా ఐదు టీ20లు ఆడేందుకు గాను ఇండియాకు వస్తుంది.  నవంబర్ చివర్లో ఈ సిరీస్ జరగాల్సి ఉంది.  

- ఇక డిసెంబర్ లో భారత జట్టు దక్షిణాఫ్రికా  పర్యటనకు వెళ్లనుంది. అక్కడ  సఫారీ టీమ్ తో  రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 లు  ఆడనుంది. సఫారీ టూర్ తో  ఈ ఏడాదికి ఎండ్ కార్డ్ పడుతుంది. 

click me!