MS Dhoni: కత్తి పట్టి రాక్షసులను సంహరిస్తున్న జార్ఖండ్ డైనమైట్.. ‘అథర్వ’ అవతారమెత్తిన ధోని

Published : Feb 03, 2022, 11:42 AM IST
MS Dhoni: కత్తి పట్టి రాక్షసులను సంహరిస్తున్న జార్ఖండ్ డైనమైట్.. ‘అథర్వ’ అవతారమెత్తిన ధోని

సారాంశం

MS Dhoni As Atharva: కత్తి పట్టుకుని రాక్షసులను సంహరిస్తున్న అథర్వ అవతారంలో ధోని కనిపించబోతున్నాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నాయి.

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని కొత్త అవతారమెత్తారు. ఇన్నాళ్లు  మైదానంలో  ఆడగాడిగా.. భారత జట్టుకు రెండు ప్రపంచకప్పులు అందించిన సారథిగా.. మెంటార్ గా సేవలందించిన అతడు.. ఇప్పుడు  మరో పాత్రలోకి  అడుగిడబోతున్నాడు. ఈ  జార్ఖండ్ డైనమైట్ ఇప్పుడు ‘అథర్వ’  గా మారాడు. ప్రముఖ తమిళ రచయిత రమేశ్ తమిళ్మణి రచించిన గ్రాఫిక్ నవల ‘అథర్వ : ది ఆరిజన్’లో హీరో పాత్రలో ధోని కనిపించబోతున్నాడు.  ఇందుకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.  ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నాయి.

కత్తి పట్టుకుని రాక్షసులను సంహరిస్తున్న అథర్వ అవతారంలో ధోని కనిపించబోతున్నాడు. సైంటిఫిక్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే ఈ నవల (ఇంకా  మార్కెట్ లోకి రాలేదు) ఆధారంగా దీన్ని రూపొందిస్తన్నారు. వెబ్ సిరీస్ గా  రూపొందుతున్న ఈ  సైంటిఫిక్ ఫిక్షన్  నవలలో ధోని హీరో  ‘అథర్వ’ పాత్రను పోషిస్తున్నాడు. 

 

పీరియాడిక్ నవలగా తెరకెక్కుతున్న  అథర్వ..  త్వరలో అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానున్నది. విర్జూ స్టూడియోస్, మిడాస్ డీల్స్  ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల నుంచి ఈ నవల రానుంది. ఇక  ధోని ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ కూడా.. దీని నిర్మాణంలో పాలుపంచుకుంటున్నది. 

అథర్వ మోషన్ పోస్టర్ విడుదల సందర్భంగా ధోని మాట్లాడుతూ.. ‘ఈ  ప్రాజెక్టుతో కలిసినందుకు నేను చాలా థ్రిల్ అవుతున్నాను. ఇది నిజంగా అద్భుతమైన వెంచర్..’ అని కొనియాడాడు. 

 

2016లో ధోని జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్, కియారా అధ్వానీ, దిశా పటానీలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ధోని అభిమానులను విశేషంగా అలరించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆ సినిమాలో హీరో నేనే అంటే.. నిర్మాత చేయనన్నాడు.. ధనరాజ్
ఖడ్గం సినిమాలో సంగీత పాత్ర పుట్టింది అలా.. కృష్ణవంశీ ఏం చెప్పారంటే.?