పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఏడుగురికి కరోనా పాజిటివ్... పీఎస్ఎల్ 2021 వాయిదా....

By team teluguFirst Published Mar 4, 2021, 1:10 PM IST
Highlights

పీఎస్‌ఎల్ 2021లో ఏడుగురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్...

వెంటనే పాక్ సూపర్ లీగ్‌‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన పీసీబీ...

గత ఏడాది కూడా కరోనా కారణంగా వాయిదా పడిన పాకిస్తాన్ సూపర్ లీగ్...

ఆర్భాటానికి పోయి పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను మొదలెట్టిన పాక్ క్రికెట్ బోర్డుకి ఊహించని షాక్ తగిలింది. ఫిబ్రవరి 20న మొదలైన ఆరో సీజన్‌ పాక్ సూపర్ లీగ్, కరోనా కేసుల కారణంగా వాయిదా పడింది. పాక్ సూపర్ లీగ్‌లో పాల్గొంటున్న ఏడుగురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్ రావడంతో పీఎస్‌ఎల్‌ 2021ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది పీసీబీ.

గత ఏడాది పీఎస్‌ఎల్ కూడా కరోనా కారణంగా వాయిదా పడి, ఐపీఎల్ తర్వాత తిరిగి ప్రారంభమైంది. పీఎస్ఎల్ 2020 సీజన్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో పర్యటించిన పాక్ జట్టులో 9 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది.

ఐపీఎల్ కంటే, పీఎస్‌ఎల్ ఆడడంలోనే తనకి సంతృప్తి కలుగుతుందని సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ కామెంట్ చేసిన రెండు రోజులకే పాక్ లీగ్ వాయిదా పడడం విశేషం. 

click me!