నీ వల్లే.. అంతా నీవల్లే.. టీమిండియా ఓటమికి నువ్వే కారణం.. విహారిని తిట్టిపోస్తున్న నెటిజన్లు

Published : Jul 05, 2022, 04:36 PM ISTUpdated : Jul 05, 2022, 04:37 PM IST
నీ వల్లే.. అంతా నీవల్లే.. టీమిండియా ఓటమికి నువ్వే కారణం.. విహారిని తిట్టిపోస్తున్న నెటిజన్లు

సారాంశం

ENG vs IND: ఎడ్జబాస్టన్ టెస్టులో భారత జట్టు ఓటమి పాలైంది. ఆట నాలుగో రోజు ఇంగ్లాండ్ బ్యాటర్ బెయిర్ స్టో ఇచ్చిన క్యాచ్ ను మిస్ చేయడమే భారత ఓటమికి కారణమని... 

టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ హనుమా విహారి నెటిజన్ల ట్రోలింగ్ కు బలవుతున్నాడు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలుపునకు ఇండియా ఓటమికి అతడే కారణమని విహారిపై టీమిండియా ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు.  బ్యాటింగ్ లో పెద్దగా రాణించని అతడు.. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో కీలక సమయంలో బెయిర్ స్టో క్యాచ్ మిస్ చేయడమే ఇందుకు కారణమని వాపోతున్నారు. 

ఆట నాలుగో రోజులో భాగంగా  భారీ లక్ష్య ఛేదనలో అప్పటికే ఇంగ్లాండ్.. 153 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. అప్పుడే క్రీజులోకి వచ్చిన తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో  జానీ బెయిర్ స్టో.. 14 పరుగుల వద్ద ఉండగా మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో అతడు ఇచ్చిన క్యాచ్ ను స్లిప్స్ లో ఉన్న హనుమా విహారి జారవిడచాడు. 

అసలే ఫుల్ ఫామ్ లో ఉన్న బెయిర్ స్టో వంటి ఆటగాడు ఇచ్చిన క్యాచ్ ను నేలపాలు చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందనేది ఇండియాకు త్వరగానే తెలిసొచ్చింది. క్యాచ్ మిస్ తర్వాత వచ్చిన అవకాశంతో బెయిర్ స్టో.. జో రూట్ తో కలిసి వీరవిహారం చేశాడు. ఇంగ్లాండ్ ను విజయతీరాలకు చేర్చాడు. 

 

దీంతో హనుమా విహారిపై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పలువురు నెటిజన్లు ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘బెయిర్ స్టో క్యాచ్ మిస్ అనేది టీమిండియా చెల్లించుకోవాల్సిన భారీ మూల్యం. ఇది ఫలితం మీద ప్రభావం చూపుతున్నది..’, ‘ఈ టెస్టులో టీమిండియా ఓడిందంటే దానికి కారణం.. హనుమా విహారి అట్టర్ ఫ్లాఫ్ బ్యాటింగ్ షో, బెయిర్ స్టో క్యాచ్ మిస్ చేయడం.. విరాట్ కోహ్లి చెత్త ఆట..’, ‘విహారి నువ్వుసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా..? బెయిర్ స్టో ఎంత ప్రమాదకర ఆటగాడో తెలుసా..?’ అని తిట్టిపోస్తున్నారు. 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు