117 రోజుల తర్వాత క్రికెట్ మ్యాచ్: సంతోషంలో రోహిత్.. అక్కడికి వెళ్లాలని ఉందంటూ ట్వీట్

By Siva KodatiFirst Published Jul 9, 2020, 8:27 PM IST
Highlights

ఇంగ్లాండ్- వెస్టిండీస్ జట్ల మధ్య బయోసెక్యూర్ విధానంలో జరుగుతున్న టెస్టుతో ఫ్యాన్స్ కొంత ఊరట చెందుతున్నారు. సుమారు 117 రోజుల విరామం తర్వాత ప్రారంభమైన ఈ మ్యాచ్‌ని చూసి సంబరపడుతున్నారు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా అన్ని రకాల క్రీడలు వాయిదా పడటమో లేదంటే రద్దవ్వడమో జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రికెట్‌ను ఒక మతంగా భావించే మనదేశంలో ఈ పరిస్థితిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

అయితే దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత క్రికెట్ మ్యాచ్‌లు మళ్లీ మొదలవుతున్నాయి. ఇంగ్లాండ్- వెస్టిండీస్ జట్ల మధ్య బయోసెక్యూర్ విధానంలో జరుగుతున్న టెస్టుతో ఫ్యాన్స్ కొంత ఊరట చెందుతున్నారు.

Also Read:చక్రం తిప్పిన అమిత్ షా, ఐపీఎల్ 2020 వేదిక ఫిక్స్...?

సుమారు 117 రోజుల విరామం తర్వాత ప్రారంభమైన ఈ మ్యాచ్‌ని చూసి సంబరపడుతున్నారు. మళ్లీ క్రికెట్ మ్యాచ్‌లు టీవీ తెరల ముందు కదలాడుతుండటంతో మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ఆటగాళ్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గంగూలీ, అశ్విన్, రికీ పాంటింగ్, షేర్ వార్న్ వంటి క్రికెటర్లు మ్యాచ్‌లు ప్రారంభమవడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ చేరాడు.

‘‘ క్రికెట్ మళ్లీ మొదలయ్యింది... ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పరిస్థితులన్నీ సానుకూలంగానే ఉన్నాయి. తిరిగి ఆట ప్రారంభమవ్వడం చూస్తే చాలా ఆనందంగా ఉంది. తనకు కూడా అక్కడికి వెళ్లి మ్యాచ్ చూడాలనిపిస్తోందని రోహిత్ ట్వీట్ చేశాడు.

Also Read:ఆసియా కప్ రద్దు.. ఆయన మాటలకు విలువ లేదు: గంగూలీపై పీసీబీ మండిపాటు

కాగా సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్- వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో బుధవారం మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. గురువారం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా వర్షం అంతరాయం కలిగించింది.

బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లీష్ జట్టు 40 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. ముఖ్యంగా వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తూ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేస్తున్నాడు. 

click me!