‘‘ దేవుడిచ్చిన ఆశీర్వాదం ’’: కొడుకును చేతుల్లోకి తీసుకుని హార్దిక్ ఉద్వేగం

Siva Kodati |  
Published : Aug 01, 2020, 02:40 PM ISTUpdated : Aug 01, 2020, 02:41 PM IST
‘‘ దేవుడిచ్చిన ఆశీర్వాదం ’’: కొడుకును చేతుల్లోకి తీసుకుని హార్దిక్ ఉద్వేగం

సారాంశం

తన చిన్నారి బిడ్డను ప్రేమతో చేతుల్లోకి తీసుకుని తండ్రిగా ఉద్వేగానికి గురవుతున్న ఫోటోను శనివారం అభిమానులతో పంచుకున్నాడు. ‘‘ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ పెట్టాడు.

టీమిండియా విధ్వంసక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తండ్రైన సంగతి తెలిసిందే. ఆయనకు కాబోయే భార్య సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిక్‌ ఇటీవల పండంటి బాబుకు జన్మనిచ్చారు.

కుమారుడిని చేతిని పట్టుకున్న ఫోటోను పాండ్యా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాజాగా తన చిన్నారి బిడ్డను ప్రేమతో చేతుల్లోకి తీసుకుని తండ్రిగా ఉద్వేగానికి గురవుతున్న ఫోటోను శనివారం అభిమానులతో పంచుకున్నాడు.

Also Read:పెళ్లికాకుండానే తండ్రైన హార్దిక్ పాండ్యా: మగబిడ్డకు జన్మనిచ్చిన కాబోయే భార్య

‘‘ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ పెట్టాడు. దీంతో హార్దిక్‌కు క్రికెట్ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అనేక మంది హార్దిక్ పోస్టుకు లైకులు, కామెంట్‌లు చేయడంతో ప్రస్తుతం ఈ తండ్రి, కొడుకుల ఫోటో వైరల్‌గా మారింది.

కాగా హార్దిక్, నటాషా జోడీ ఈ ఏడాది జనవరి 1న తమ నిశ్చితార్ధం జరిగినట్లు ప్రకటించింది. ఆ తర్వాత మే 31న తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రపంచానికి తెలిపారు. తమ జీవితంలో ఈ కొత్త దశ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని.. ఈ సమయంలో అభిమానుల ఆశీస్సులు, ప్రేమ కావాలని కోరారు. 

 

 

PREV
click me!

Recommended Stories

Abhishek Sharma : అభిషేక్ శర్మ సిక్సర్ల మోత అసలు సీక్రెట్ ఇదే
అయ్యర్ వెర్సస్ తిలక్ వర్మ.. టీ20ల్లో కోహ్లీకి వారసుడు ఎవరు.? ఇప్పుడిదే హాట్ టాపిక్