విరాట్ కోహ్లీ హ్యాట్రిక్...మరో అరుదైన అవార్డు కైవసం

By Arun Kumar PFirst Published Apr 11, 2019, 4:50 PM IST
Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టు కు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. కొన్ని మ్యాచుల్లో అయితే ఒంటిచేత్తో విజయాలను అందించాడు. ఇలా తన బ్యాట్ నుండి పరుగుల వరద పారిస్తూ ఎన్నో రికార్డులను మరెన్నో అవార్డులను కొల్లగొట్టిన విరాట్ ఖాతాలోకి మరో అరుదైన అవార్డు చేరింది. 

2018 సంవత్సరంలో అత్యుత్తమ ఆటతీరును కనబర్చిన కోహ్లీ విజ్డెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును కైవసం చేసుకున్నాడు. గత సంవత్సరం టెస్ట్,, వన్డే, టీ20 ఫార్మాట్ ల ప్రదర్శనను బట్టి అతడికి ఈ అవార్డును అందించారు. ఈ మూడె పార్మాట్లలో కలిపి 2018 లో కోహ్లీ సాధించిన పరుగులు 2735. ఇలా వరుసగా మూడో ఏడాది కూడా ఈ అవార్డును కోహ్లీ సొంతమైంది. 

ప్రముఖ క్రికెట్ మ్యాగజైన్ విజ్డెన్ 1889 నుంచి ఈ అవార్డులను అందిస్తోంది. ప్రతి ఏడాది అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఆటతీరు కనబర్చిన ఆటగాళ్ళకు ఈ అవార్డు అందిస్తోంది. మహిళా క్రికెటర్లకు కూడా ఈ అవార్డును అందిస్తున్నారు. 2018 సంవత్సరానికి గానీ మహిళా క్రికెట్ విభాగంలో కూడా భారత్ ప్లేయర్ స్మృతి మంధాన లీడింగ్ క్రికెటర్ గా నిలవడం విశేషం.

ఇక కేవలం టీ20 విభాగంలో అప్ఘనిస్తాన్ స్పిన్నర్  రషీద్ ఖాన్ ''లీడింగ్ టీ20 క్రికెటర్'' అవార్డును కైవసం చేసుకున్నాడు. అతడు తన స్పిన్ మాయాజాలంతో అద్భుతంగా రాణిస్తూ అప్ఘాన్ జట్టుకు వెన్నెముఖలా మారాడు. ఇలా అప్ఘాన్ తరపున టీ20 మ్యాచుల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తూ అత్యధికంగా వికెట్లు పడగొట్టడంతో విజ్డన్ ఈ అవార్డుకు రషీద్ ఖాన్ ఎంపిక చేసింది. 

ఐసిసి గతేడాది ప్రకటించిన క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును కోహ్లీ, మంధాన గెలుచుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఇలా వారిద్దరే లీడింగ్‌ క్రికెటర్‌ అవార్డులను అందుకోవడం విశేషం.

click me!