పొలార్డ్ విధ్వంసం... ఉత్కంఠ పోరులో పంజాబ్‌పై ముంబైదే పైచేయి

By Arun Kumar PFirst Published Apr 11, 2019, 8:43 AM IST
Highlights

ఐపిఎల్ 2019లో మరో ఉత్కంఠ పోరుకు వాంఖడే స్టేడియం వేదికయ్యింది. ఇక్కడ  బుధవారం ముంబై ఇండియన్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య నరాలు తేగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్ లో చివరకు ఆతిథ్య జట్టుదే పైచేయిగా నిలిచింది. పంజాబ్ నిర్దేశించిన 198 పరుగుల భారీ లక్ష్యాన్ని చివరి బంతికి చేధించి ముంబై 3 వికెట్ల తేడాతో  విజయాన్ని అందుకుంది. 

ఐపిఎల్ 2019లో మరో ఉత్కంఠ పోరుకు వాంఖడే స్టేడియం వేదికయ్యింది. ఇక్కడ  బుధవారం ముంబై ఇండియన్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య నరాలు తేగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్ లో చివరకు ఆతిథ్య జట్టుదే పైచేయిగా నిలిచింది. పంజాబ్ నిర్దేశించిన 198 పరుగుల భారీ లక్ష్యాన్ని చివరి బంతికి చేధించి ముంబై 3 వికెట్ల తేడాతో  విజయాన్ని అందుకుంది. 

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టు ముంబై బౌలర్లపై విరుచుకుపడింది. ముఖ్యంగా మొదట్లో ఓపెనర్ గేల్ (63 పరగులు 36 బంతుల్లో)  చెలరేగాడు. అయితే గేల్ వున్నంతసేపు నెమ్మదిగా ఆడుతూ అతడికి స్ట్రైక్ రొటేట్ చేయడానికే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ పరిమితమయ్యాడు. ఇలా వీరిద్దరు తొలి వికెట్ కు 116 పరగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. 

అయితే గేల్ వికెట్ పడిన తర్వాతే రాహుల్ తన అసలు ఆటను ప్రారంభించాడు. చివరి ఓవర్లలో భారీ షాట్లతో విరుచుకుపడుతూ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు.  ఈ క్రమంలో చివరి ఓవర్లో సెంచరీని పూర్తిచేసుకున్నాడు. ఇలా కేవలం 64 బంతుల్లోనే సెంచరీ సాధించి అజేయంగా నిలిచి  జట్టుకు 197 భారీ స్కోరును అందించాడు. 

198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టును డాషింగ్ బ్యాట్ మెన్ పొలార్డ్ ఒంటిచేత్తో గెలిపించాడు. సహచరులంతా తక్కువ స్కోరుకే పరిమితమైన సమయంలో పొలార్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పంజాబ్ బౌలర్లను ఊచకోతకోస్తూ కేవలం 31 బంతుల్లోనే  83 పరుగులు సాధించాడు. అయితే చివరి ఓవర్లో పొలార్డ్ ఔటవడంతో మ్యాచ్ లో మరింత ఉత్కంఠ పెరిగింది.  

చివరి ఓవర్లో ముంబై విజయానికి ఇంకా 15 పరగులు అవసరమైన సమయంలో పంజాబ్ కెప్టెన్ రాజ్‌పూత్ కు బంతిని అందించాడు. అయితే  మొదటి బంతినే అతడు నోబాల్ వేయగా దాన్ని పొలార్డ్ సిక్సర్ గా మలిచాడు.ఆ తర్వాత బంతిని కూడా ఫోర్ బాదడంతో మ్యాచ్ మొత్తం ముంబై వైపు మళ్లింది. 

ఈ సమయంలోనే రాజ్ పూత్ ఓ అద్భుతమైన బంతితో పొలార్డ్ ఔట్ చేశాడు. ఇలా విజయానికి మరో నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు అవసరమైన సమయంలో అతడు ఔటవడంతో ఉత్కంఠకు దారితీసింది. అయితే  చివరి బంతికి రెండు పరుగులు అవసరమున్న సమయంలో  జోసెఫ్‌(15 నాటౌట్‌) ఆ పని చేసి ఉత్కంఠను తెరదించుతూ ముంబై ఇండియన్స్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

  

click me!